అసలే సొగసు సెగ మామూలుగా ఉండదు. అది కాక మీద ఉంటే ఆ హీటు యవ్వారం అలా ఇలా చెప్పలేనిదే. పడుచు అందం పందెం కడితే ప్రళయమే మరి. పదునైన చూపులే చాలవా ఎదురులేదన్న వారిని సైతం ఓడించేయడానికి.
అపుడెపుడో మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సోఫీ చౌదరి ఆ తరువాత కూడా బాలీవుడ్ లో ఐటెం గర్ల్ గానే స్థిరపడింది. సినిమాలు పక్కన పెడితే అవార్డు ఫంక్షన్స్ లోను, సోషల్ మీడియా లోను హాట్ హాట్ అందాలతో కవ్విస్తూ ఉంటుంది సోఫీ చౌదరి. ఈ మధ్య కాలంలో మాత్రం అందాల ఆరబోత డోస్ బాగా పెంచేసింది. ఈ అమ్మడు రీసెంట్ గ పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలను చూస్తూంటే పిచ్చి ఎక్కడం ఖాయమంటున్నారు.
సోఫీ పిక్స్ చూస్తే సాఫీగా ఉండాలనుకున్నా కుదిరేట్టు లేదని కుర్రకారు గుండె పట్టుకున్నారంటే తప్పేముంది. ఈ అమ్మడు వేసవి ఎండలను మించే హీట్ అంటున్నారు. జోలికి వస్తే కాలిపోతామని కూడా ఒప్పేసుకుంటున్నారు.