పోర్న్ స్టార్ సన్నీలియోన్ సినిమాలంటేనే హాట్‌ సన్నివేశాలు వుంటాయని ప్రేక్షకుల ఆశ. కానీ ఆమె నటించిన ఓ మూవీకి సెన్సార్ అధికారులు ఏకంగా ‘యు’ సర్టిఫికెట్ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. సన్నీలియోన్ ‘వడకర్రీ’ అనే తమిళ మూవీలో నటిస్తూ దక్షణాది సినిమా రంగంలో ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో సన్నీ ఐటమ్ సాంగ్ ఉండటంతో కోలీవుడ్ ప్రేక్షకులు రకరకాలుగా ఊహించుకున్నారు.  ఈ పాటలో సన్నీ కూడ తన అందాలను బాగానే ఆరబోసిందని కోలీవుడ్ టాక్. దీనితో ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ ఖాయమని యూనిట్‌సభ్యులు భావించారు. అయితే యూనిట్ సభ్యులు మరియు సినీ అభిమానులు ఊహించని విధంగా సెన్సార్ అధికారులు ఈ సినిమాకు ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చి ఈ సినిమా నిర్మాతల మైండ్ బ్లాంక్ చేసారు.  అంతేకాదు ఈ సినిమాలో పెద్దగా హాట్‌సీన్లు లేవని, అభిమానులు ఆశించినంత విధంగా సన్నీ ఎక్స్‌పోజింగ్ చేయలేదని ఇప్పుడు కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. అందుకే ఇవన్నీ ముందుగా ఊహించే కాబోలు మంచు వారి అబ్బాయి మనోజ్ సన్నీని తన ‘కరెంటు తీగ’ సినిమాలో ఎవరు ఊహించని విధంగా చీరలో చూపెడతాను అని అంటున్నాడు.  మన దక్షణాది హీరోయిన్స్ అంతా బికినీలు వేసుకుని హాట్ హీరోయిన్స్ గా మారిపోతూ ఉంటె సన్నీ మాత్రం తన పోర్న్ స్టార్ ఇమేజ్ నుండి చీర కట్టుతో మంచి అమ్మాయి గా మారిపోతోంది. 
 
Top