గత రెండు రోజుల నుంచి తనను కలుస్తున్న వారి దగ్గర పవన్ చేస్తున్న కామెంట్స్
ను బట్టి పవన్ మరో యుద్ధానికి మానసికంగా సిద్ధం అవుతునట్లు అనిపిస్తోంది
అని విశ్లేషకులు అంటున్నారు ఎపి హెరాల్డ్ కు అందుతున్న సమాచారం మేరకు
ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో పవన్ తన దూకుడును పెంచాలని ‘జనసేన’ అధినేత
పవన్ నిర్ణయించుకన్నట్లు సమాచారం.
జనసేనను ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా తీర్చిదిద్దుతానని
ఆయన అన్నట్లు వార్తలు వస్తున్నాయి.. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ
(జిహెచ్ఎంసి) ఎన్నికల్లో పోటీ చేస్తే సీట్లు రావనే భయం తమకు లేదని ఓటమిని
కూడా స్వాగతించే శక్తి తనకు ఉందని పవన్ అంటున్నట్లు టాక్.
పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే దానికి అనుభవం కావాలని ఆయన
అన్నట్లు వార్తలు వచ్చాయి. రెండు మూడు సార్లు విఫలం కావడానికి కూడా తాను
సిద్ధంగా ఉన్నానని పవన్ అన్నట్లు సమాచారం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఉద్యోగుల విషయంలో
విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం తాను ఏ మాత్రం భరించలేక
పోతున్నానని పవన్ కామెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎవరి దగ్గరైనా ఏమైనా నిర్మాణాత్మక సూచనలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే మోడీ
ప్రభుత్వానికి చెబుతానని పవన్ కళ్యాణ్ అంటున్నట్లుగా తెలుస్తోంది. బయటకు
వస్తున్న వార్తలను బట్టి ఎన్నికలు ముగిసినా పవన్ ఆవేశం ఏ మాత్రం చల్లార
లేదు సరికదా మరో ప్రజాపోరాటం వైపు పవన్ ఆలోచనలను మళ్ళి స్తోంది అనుకోవాలి.