ప్రస్తుతం శ్రుతిహాసన్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ను డబ్బుగా మార్చు కోవడానికి ఆమె నటించిన ఒక బూతు సినిమాను తెలుగులో డబ్ చేసి కోట్లు దండుకోవాలని ఒక నిర్మాత చేస్తున్న ప్రయత్నం టాలీవుడ్ హాట్ న్యూస్ గా మారింది. లేటెస్ట్ గా విడుదలైన ‘రేసు గుర్రం’ లో అందాలు ఆరబోసిన శ్రుతిహాసన్ ఒక డిఫరెంట్ ఇమేజ్ తో బాలీవుడ్ లో గత సంవత్సరం ఒక ప్రయోగాత్మక సినిమాలో నటించి విమర్శకుల దగ్గర నుంచి ప్రశంసలను పొందింది. పాకిస్తానీ వేశ్యగా బాలీవుడ్ సినిమాలో శ్రుతి హాట్ రోల్ లో నటించిన " డి డే "ని తెలుగులో ‘గెలుపు గుర్రం’ పేరుతో డబ్ చేస్తున్నారు. డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఆ మూవీలో శృతి హాట్ హాట్ రొమాంటిక్ సీన్స్ హైలైట్ అయ్యాయి. అయితే ఈసినిమాను తమిళంలో డబ్ చేద్దామని చాలామంది నిర్మాతలు ప్రయత్నించినా శ్రుతి వారి ప్రయత్నాలకు అడ్డు పడి కోలీవుడ్ లో తన ఇమేజ్ ను ఈ సినిమా డబ్బింగ్ దెబ్బ తీస్తుందని ఆపివేసిన సందర్భాలు గతం లో ఉన్నాయి. అటువంటి శ్రుతి టాలీవుడ్ లో ఈ ‘డి డే’ డబ్బింగ్ ప్రయత్నానికి ఎలా ఒప్పు కుంది అనే సందేహాలు అందరికి కలుగుతున్నాయి. ఇప్పటికే డబ్బింగ్ వర్క్ పూర్తి అయిన ఈ సినిమాకు శృతి క్రేజ్ రీత్యా భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.  
 
Top