మీరు చదవబోతున్న ఈ వార్త ఆశ్చర్యం అనిపించినా అది నూటికి నూరుపాళ్ళు నిజం. సామాన్యంగా సినిమా ఇప్పటి వరకు మనం చూస్తున్న సినిమాలు రెండు గంటల నుండి మూడు గంటల లోపు ఉంటాయి. ఇంకా పెద్ద సినిమాలైతే మరో పదిపదిహేను నిముషాలు ఎక్కువగా ఉంటాయి.  కానీ ఏకంగా ఒక సినిమా 720 గంటలు ఉండబోతోంది అనే వార్తలు ఇప్పుడు హాలీవుడ్ ను కుదిపేస్తున్నాయి. ఈ సినిమా చూడాలి అంటే రెండు గంటలలో అయ్యే సినిమా కాదు 30 రోజులు కూర్చుని చూడాలి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకోని కొందరు తమ క్రియేటివిటీతో రికార్డుల కోసం ప్రయత్నంచేస్తున్నారు. ఈక్రమంలోనే ప్రపంచంలోనే ఓ లాంగెస్ట్ మూవీ రూపొందుతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ 720 గంటల సినిమా పేరు 'యాంబియన్స్'. ఆండర్స్ వెబెర్గ్ అనే దర్శకుడు చేస్తున్న ఈ భారీ సినిమా 2020 లో పూర్తవుతుందట. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు ఈ ట్రైలర్ కూడా రికార్డులను సృష్టిస్తోంది.  దీనికి కారణం ఈ సినిమా ట్రైలర్ కూడా మామూలు సినిమాల ట్రైలర్స్ కు భిన్నంగా ఏకంగా 72 నిమిషాలు ఉంటుందట. ఈ ట్రైలర్ ను విడుదల చేసి హాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది ఈ చిత్రయూనిట్. కేవలం ట్రైలర్ చూడాలంటేనే మనం సినిమా చూసినట్లుగా చూడాలన్న మాట. 2020లో విడుదలయ్యే ఈ సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
 
Top