గతంలో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తళుక్కున మెరిసిన బ్యూటీ కేథరిన్ థెరిస్సా. కేథరిన్ థెరిస్సా నటించిన ఇద్దరమ్మాయిలతో మూవీ తరువాత తనకి వరుసగా భారీ ఆఫర్స్ వస్తాయనుకుంటే, తనకి మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ఆ మూవీ తరువాత తన వద్దకి వచ్చిన ఆఫర్స్ అన్నీ కూడ వల్గారిటికి ప్రాధాన్యం ఉన్న మూవీలే కావటంతో, తనకు ఆ మూవీలలో చేయటం ఇష్టం లేక వాటిని వెనక్కి పంపించి వేసిందట. ఇదిలా ఉంటే తను ప్రస్తుతం నటిస్తున్న మూవీ కేవలం రుద్రమదేవి మాత్రమే. తాజాగా తను హీరోయిన్ గా చేస్తున్న మరో మూవీ పేరు బయటకు వస్తుంది. తమిళంలో ఘన విజయం సాదించిన ‘మంజ’ చిత్రాన్ని తెలుగులో మంచు విష్ణు హీరోగా దర్శకరత్న దాసరి రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా రెజీనాని తీసుకునే అవకాశం ఉందని వార్తలు రాగా, ఇప్పుడు అసలు హీరోయిన్ ఎవరు అన్నదానిపై క్లియర్ న్యూస్ బయటకు వచ్చింది. మంచు విష్ణుకు జోడిగా కేథరిన్ థెరిస్సాని ఎంపిక చేశారని సమాచారం. జూలై 24వ తేది నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దాదాపు సింగల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేయడానికి చిత్రయూనిట్ ప్లానింగ్స్ చేసుకుంటుంది. ఇద్దరమ్మాయిలతో మూవీ తరువాత కేథరిన్ థెరిస్సా చాలా ఆఫర్స్ ని వదులుకుంది. అయితే తను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ మూవీలు చేజిక్కించుకోవాలంటే ఎక్స్ ఫోజింగ్ వంటి విషయాలను లైట్ తీసుకుంటే నే సాధ్యం అని తెలుసుకుందట. అందుకు నిర్మాతలు పెడుతున్న డిమాండ్స్ కి కేథరిన్ ఎట్టకేలకు ఒప్పుకుంటుందనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది. ‘మంజ’ రీమేక్ దాసరి దర్శకత్వం వహించబోయే 151వ సినిమా. తొలి సినిమా ‘తాత మనవడు’తో తెలుగు పరిశ్రమలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన దాసరి, తన 151వ సినిమా కథను కూడ అదే తరహాలో ఎంచుకున్నాడు.