నిన్నటి రోజున విడుదలైన ‘దృశ్యం’ మొదటి రోజు మొదటి రోజు మొదటి ఆట నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కామెడీ ట్రాక్ లేకుండా హీరో, హీరోయిన్స్ పై పాటలు లేకుండా మాస్ మసాలా పంచ్ డైలాగ్స్ లేకుండా వచ్చిన ‘దృశ్యం’ ఖచ్చితంగా వైవిధ్యభరితమైన సినిమాగా ప్రేక్షకులను మెప్పిస్తుంది. అయితే ఈ సినిమాకు బి,సి సెంటర్ల నుండి ఎటువంటి స్పందన వస్తుంది అన్న విషయం పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ సినిమాలో హీరో పాత్రధారి వెంకటేష్ మహేష్ భార్య నమ్రత పై చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారాయి. ఈ సినిమాలో హీరో వెంకటేష్ కేబుల్ ఆపరేటర్ కాబట్టి ఎప్పుడూ తన భార్య మీనాతో సినిమాలు గురించే మాట్లాడుతాడు ఇదే సందర్భంలో మహేష్ భార్య నమ్రత గురించి కామెంట్స్ చేస్తూ ఆమె కెరియర్ మంచి పీక్ లో ఉండగా పెళ్లి తరువాత నమ్రత సినిమాలను వదులుకుని కేవలం కుటుంబానికి పరిమితం అయి ఇల్లు చక్కగా చూసుకుంటోoదని ఇల్లాలంటే అలా ఉండాలి అని జోక్ చేస్తాడు వెంకటేష్. దానికి మీనా తెలివిగా కౌంటర్ ఇస్తూ కోట్లు సంపాదించే మహేష్ బాబు లాంటి భర్త ఉంటే ఏ భార్య అయినా అలాగే ఉంటుంది అని సెటైర్ వేస్తుంది. ఈ డైలాగ్ విన్న మహేష్ అభిమానులు మాత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో అన్నగా నటించిన వెంకటేష్ కు తమ్ముడు మహేష్ పై ఇంకా ప్రేమ పోలేదు అని వెంకీ మీద సెటైర్లు వేసుకుంటున్నారు. అయితే మహేష్ బాబుకు మాత్రం వెంకీ విసిరిన డైలాగ్ పంచ్ జోష్ తో కూడిన షాక్ ఇస్తుందనే అనుకోవాలి.