టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల మహర్షితో సూపర్ డూపర్ ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే దాని తరువాత ప్రస్తుతం తన 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు లో నటిస్తున్నారు సూపర్ స్టార్. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తొలిసారి మహేష్ బాబు, అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ రోల్ లో నటిస్తున్నారు. మంచి ఆకట్టుకునే కథ, కథనాలతో పాటు పూర్తిగా కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో మంచి అంచనాలున్నాయి. 

ఇక దాని తరువాత చేయబోయే సినిమాలపై మహేష్ ఇప్పటినుండే గట్టిగా ఫోకస్ చేసినట్లు చెప్తున్నారు. తన తదుపరి 27వ సినిమా దర్శకుడిని మహేష్ బాబు అతి త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ విషయమై పరశురామ్, సందీప్ రెడ్డి వంగ, పూరి జగన్నాథ్, ప్రశాంత్ నీల్ వంటి పలువురి పేర్లు ప్రచారం అవ్వగా, వారిలో మహేష్ ఎవరితో సినిమా చేస్తారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇకపోతే ఎన్నో ఏళ్ళ నుండి రాజమౌళితో సినిమా కోసం ఎదురుచూస్తున్న సూపర్ స్టార్, ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ తరువాత ఆయన దర్శకత్వంలో నటించనున్నట్లు సమాచారం. వారిద్దరి కాంబినేషన్లో రాబోయేది మంచి కమర్షియల్ సినిమా అని, అలానే అది ఒకప్పుడు మహేష్ తండ్రైన కృష్ణ గారు నటించిన జేమ్స్ బాండ్ సినిమాల తరహా సబ్జక్ట్ అని అంటున్నారు. 

అది ఎంతవరకు కరెక్ట్ అనే దానిపై రాబోయే రోజుల్లో కానీ తెలియదని, అయితే వారిద్దరి కాంబినేషన్ సినిమాను నిర్మించేది మాత్రం దుర్గ ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణ అని తెలుస్తోంది. గతంలో మహేష్ బాబు పలు సందర్భాల్లో ఆ విషయం చెప్పినప్పటికీ, అది ఎంతవరకు జరుగుతుందో అంటూ పలువురు సందేహం వ్యక్తం చేసారు. అయితే నేడు దీనిపై కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి గట్టిగా వార్తలు వస్తున్నాయి. నిజానికి మహేష్, ఎప్పటికైనా రాజమౌళితో సినిమా చేస్తే అది దుర్గ ఆర్ట్స్ బ్యానర్ లోనే చేయాలని ఫిక్స్ అయ్యారని, దానిలో ఎటువంటి మార్పు లేదని మహేష్ సన్నిహితులు కూడా చెప్తున్నట్లు సమాచారం....!!
 
Top