క్యూట్ హీరోయిన్ సమంత ఒక ప్రముఖ ఛానల్ ప్రసారం చేసిన ‘కొంచెం టచ్ లో ఉంటే
చెపుతా’ కార్యక్రమంలో టాలీవుడ్ టాప్ హీరోలకు రేటింగ్స్ ఇచ్చి ఆ కార్యక్రమం
చూస్తున్న బుల్లితెర ప్రేక్షకులకు మైండ్ బ్లాంక్ చేసింది. ఈ కార్యక్రమాన్ని
నిర్వహిస్తున్న ప్రదీప్ అడిగిన రకరకాల ప్రశ్నలకు వెరైటీగా సమాధానాలు
ఇవ్వడమే కాకుండా ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న టాప్ హీరోలకు తనదైన రీతిలో
మార్కులు కూడా వేసింది.
అయితే అందరి టాప్ హీరోలను తన మాటలతో ఆడుకున్న సమంత పవన్ కళ్యాణ్ విషయంలో
మాత్రం సంయమనం పాటించింది. పవన్ కళ్యాణ్ కు సినిమాలతో సంబంధం లేకుండా 10/10
మార్కులు ఇచ్చింది. అయితే మహేష్ కు మాత్రం ‘1 నేనొక్కడినే’ తరువాత 9/10
అంది.
అదేవిధంగా జూనియర్ కు, అల్లుఅర్జున్ కు రామ్ చరణ్ కు మహేష్ తో సమానంగా
9/10 మార్కులు వేసింది. దీనితో విసుగెత్తిపోయిన యాంకర్ ప్రదీప్ ‘9 సంఖ్య’
నిషేధం అని అంటున్నా సమంత పట్టించుకోకుండా తన మార్కుల హడావిడి
కొనసాగించింది.
అయితే చరణ్ బన్నీలు తన రేటింగ్స్ లో సమానమే అని అంటూ మెగా కాంపౌండ్ విషయంలో
తన సెటైర్లను అదుపులోనే పెట్టుకుంది సమంత. అయితే నాగచైతన్యతో టాలీవుడ్
ఎంట్రీ ఇచ్చి ‘మనం’ లాంటి సూపర్ హిట్ లో నటించిన సమంత చైతూను తన రేటింగ్స్
విషయంలో ఎందుకు వదిలేసిందో సస్పెన్స్ !