తెలుగు ఇండస్ట్రీలో రామ్ సరసన ‘దేవదాసు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా.  అందమైన నడుం వొంపు సొంపులతో తెలుగు హీరోల మనసు దోచింది. అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోల సరసన నటించి ఈ అమ్మడు నెంబర్ వన్ పొజీషన్ కి వచ్చింది. ఇదే సమయంలో బాలీవుడ్‌లో ఆమె అనుకున్నంతగా సక్సెస్‌ కాలేకపోయింది.  ఆ తర్వాత అక్కడా..ఇక్కడ తెగ ప్రయత్నాలు మొదలు పెట్టినా ఈ అమ్మడిని మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
 
ప్రస్తుతం ఆస్ట్రేలియన్‌ ఫోటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.  వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలో ఆ మద్య సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి.  తాజాగా ఓ ఆంగ్ల మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఇలియానా.. తన పాత పరిచయాల గురించి, టీనేజ్‌ లవ్‌ గురించి, సినీ పరిశ్రమలోని కాస్టింగ్‌ కౌచ్‌ (చాన్సు లో కోసం పడకగదికి వెళ్లడం) గురించి మాట్లాడింది.  ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీలో అప్పట్లో ఓ కుర్ర హీరోతో ఆరేళ్లపాటు డేటింగ్‌ చేశానని వెల్లడించింది. 

ఆ తర్వాత వారి మద్య తేడాలు రావడంతో విడిపోయామని తెలిపింది. కానీ ఆ హీరో ఎవరనేది మాత్రం గోవా బ్యూటీ చెప్పలేదు. అంతే కాదు కాస్టింగ్‌ కౌచ్‌ అనేది హీరోయిన్ల పై ఆధారపడి ఉంటుందని నటనను నమ్ముకొన్న వారికి ఇలాంటివి అస్సలు అవసరం లేదని చెబుతుంది.  సొంత ప్రతిభను నమ్ముకున్నంత వరకు ఎవరికీ దాసోహం అవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది.
 
Top