నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చిన సినిమా నిన్ను కోరి. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో నివేథా థామస్ ఫీమేల్ లీడ్ గా నటించింది. ఆది పినిశెట్టి స్పెషల్ రోల్ లో నటించాడు. లవ్ ఫెయిల్యూర్ కథతో సరికొత్త కథనంతో తెరకెక్కించాడు దర్శకుడు శివ. ఎలాంటి కన్ ఫ్యూజన్ లేకుండా కథ కథనం నడిపించిన తీరు అందరిని ఇంప్రెస్ చేసింది.

ఇక తెలుగు సినిమా హీరోలందరు సేఫ్ జోన్ లో వెళ్తుంటే నాని మాత్రం ప్రయోగాలతో హిట్ అందుకుంటున్నాడు. నిన్ను కోరిలో నాని ప్రేమ విఫలమైన ఉమా మహేశ్వర రావు పాత్రలో నటించాడు. అంతేకాదు సినిమాలో ప్రతి సీన్ లో నాని తన నటనా ప్రతిభతో ఇంప్రెస్ చేశాడు. ఇలాంటి కథ ఇలాంటి క్లైమాక్స్ బహుశా నాని లాంటి గట్స్ ఉన్న హీరో మాత్రమే చేస్తాడని చెప్పొచ్చు.

కోనా వెంకట్ కథనం సినిమాకు ఎంతో ప్లస్ అయ్యింది. అంచనాలకు తగ్గట్టుగానే సినిమా మంచి ఎమోషనల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా నిన్ను కోరి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నానితో పాటుగా నివేథా నటన ఆకట్టుకోగా సినిమాలో గోపి సుందర్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని నిన్ను కోరితో మరో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడని చెప్పొచ్చు.
 
Top