తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో జూ.ఎన్టీఆర్. గత సంవత్సరం కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సూపర్ డూపర్ హిట్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ‘సర్ధార్ గబ్బర్ సింగ్ ’ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ‘జై లవకుశ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ చాలా ఆలస్యం కావడంతో ఎన్టీఆర్ అభిమానులు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. దీంతో ఆ మద్య ‘జై లవకుశ’కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు. అందులో జై, లవ, కుశ మూడు పాత్రల్లో జై అనే పాత్ర నెగిటీవ్ షేడ్స్ ఉంటున్నట్లు తెలుస్తుంది. నిన్న రిలీజ్ అయిన ‘జై లవకుశ’ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. రిలీజైన కాస్సేపటికే జైలవకుశ టీజర్ యూట్యూబ్‌లో రచ్చ చేస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే 3 మిలియన్ల మందికి పైగా ఈ టీజర్‌ను చూశారంటే.. అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలిసిపోతోంది. ఇప్పటి దాకా 7 మిలియన్ల డిజిటల్ వ్యూస్ సాధించింది.