తెలుగు ఇండస్ట్రీలో ‘అష్టచమ్మ’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని తర్వాత మంచి హిట్ సినిమాలతో నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.  గత మూడు సంవత్సరాల నుంచి వరుస విజయాలతో దూసుకు వెళ్తున్నాడు నాని.  ఈ రోజు మరో లవ్ స్టోరీ ‘నిన్ను కోరి’ చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చాడు.  ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన  ‘ఈగ’ చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందే.  తెలుగు ఇండస్ట్రీలో అద్భుతమైన టెక్నాలజీతో రూపొందించిన చిత్రం ‘ఈగ’..ఇప్పటికీ..ఎప్పటికీ మర్చిపోలేం.

తాజాగా నానీ మరో అరుదైన చిత్రంతో అభిమానుల ముందుకు రాబోతున్నారు. ఓ చేప నేపథ్యంలో సినిమా రాబోతోంది.  అంతే కాదు ఈ చిత్రానికి నాని స్వియ నిర్మాణం అని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ప్రశాంత్‌ శర్మ దర్శకుడిగా పరిచయమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ మొదలైనట్లు టాక్‌. ఇటీవలే నానిని కలిసిన ప్రశాంత్ స్టోరీ లైన్‌ను వినిపించారని, అది నానికి తెగ నచ్చేసిందని నాని సన్నిహితులు చెబుతున్నారు.

 ‘చేప’ ప్రధానంగా రూపొందే ఈ సినిమా కథ నానికి బాగా నచ్చిందని, అందుకే వెంటనే సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారని చెప్పారు.  ఇప్పుడు నానీకి పోటీగా అల్లరి చిత్రంతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న రవిబాబు పందిని హీరోగా చూపిస్తానని చెబుతున్నాడు. విలక్షణ డైరెక్టర్ రవిబాబు  ‘అదుగో’ పందిపిల్ల హీరో అనిపించబోతున్నారు. ఇప్పుడు నాని చేప ..మరి ఆ పందిపిల్లతో పోటీ పడాలి.
 
Top