రామ్ చరణ్ టాప్ యంగ్ హీరోల రేస్ లో ఎప్పుడు నెంబర్ వన్ స్థానానికి దగ్గరలోకి వస్తాడో క్లారిటీ లేకపోయినా నిర్మాతగా మాత్రం రామ్ చరణ్ నెంబర్ వన్ టాప్ ప్రొడ్యూసర్ గా మారిపోయే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి అని అనిపిస్తోంది.  చరణ్ నిర్మాతగా ‘ఖైదీ నెంబర్ 150’ సాధించిన ఘన విజయం జనం మరువక ముందే తన తండ్రి చిరంజీవితో నిర్మoపబడే ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ మూవీకి కూడ నిర్మతగా వ్యవహరిస్తున్నాడు. 

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈమూవీ షూటింగ్ ఏప్రియల్ నెల నుండి ప్రారంభం కాబోతోంది.  ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాకుండానే చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ పై నిర్మింపబోయే ప్రొడక్షన్ నెంబర్ 3 విషయంలో కూడ అప్పుడే ఆలోచనలు మొదలు పెట్టినట్లు టాక్. 

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సంవత్సరం చివరిలో ప్రారంభం కాబోయే త్రివిక్రమ్ జూనియర్ ల కాంబినేషన్ లో నిర్మాణం కాబోతున్న సినిమాను చరణ్ నిర్మింపబోతున్నట్లు ఫిలింనగర్ లో లేటెస్ట్ గా గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. జూనియర్ కు చరణ్ కు ఎప్పటి నుంచో ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఈ క్రేజీ మూవీని చరణ్ నిర్మిస్తాడని అంటున్నారు.

రామ్ చరణ్ కు ఎప్పటి నుంచో త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాలని అభిప్రాయం ఉన్నా ఆ కాంబినేషన్ ఇప్పటి వరకు సెట్ కాలేదు. దీనితో త్రివిక్రమ్ పై తనకున్న కోరికను ఇలా నిర్మాతగా మారి జూనియర్ సినిమాను నిర్మించదానికి ఆశక్తి కనబరుస్తున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

వినిపిస్తున్న వార్తల ప్రకారం త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ తో చేస్తున్న మూవీ షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుంది అని అంటున్నారు. ఈ వార్తలే నిజం అయితే చరణ్ త్రివిక్రమ్ జూనియర్ ల మూవీ ప్రాజెక్ట్ కు భారీ బిజినెస్ అవ్వడం ఖాయం..  
 
Top