బుల్లితెర సూపర్‌స్టార్ ఎవరు అంటే ఎవరైన వెంటనే చెప్పే సమాధానం సుమ. కొన్ని వందల స్టేజ్ షోలను వేల సంఖ్యలో బుల్లితెర షోలను నిర్వహించిన సుమ ఈమధ్య గాయనిగా మారి ‘విన్నర్’ సినిమాలో అనసూయ ఐటమ్ సాంగ్ ను పాడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సాంగ్ సూపర్ హిట్ గా మారింది. 

ఈమధ్య ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమ తన కెరియర్ గురించి అదేవిదంగా బుల్లితెర వెండి తెర రంగాల గురించి అనేక ఆసక్తికర విషయాలను తెలియచేసింది. ఇదే సందర్భంలో సుమ మరొక షాకింగ్ న్యూస్ ను బయట పెట్టింది.  

సినీ, టెలివిజన్, ఇతర సాంస్క‌తిక కార్యక్రమాలలో తాను నిర్వహిస్తున్నప్పుడు ఎదురైనా కొన్ని విచిత్ర సంఘటనలను అదేవిధంగా ఇప్పటి వరకు బయటకు రాని కొన్ని ఆసక్తికర విషయాలను తాను అక్షర రూపం కల్పించి త్వరలో ఒక పుస్తకంగా వ్రాయబోతున్నట్లు సుమ సంచలన విషయాన్ని బయట పెట్టింది. అంతేకాదుసినిమాలలో నటించాలని తనకు పెద్దగా కోరిక లేదని సినిమా నటన కంటే తన బుల్లితెర యాంకరింగ్ పట్ల ఎక్కువ మక్కువ అన్న అభిప్రాయాన్ని బయట పెట్టింది సుమ. 

అయితే విన్నర్ లో తాను పాడిన పాట హిట్ అయినా తనకు గాయనిగా పాటలు పాడాలనే కోరిక లేదనీ అంటూ తన దృష్టి అంతా బుల్లితెర పైనే అంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది. ఇక తాను పాడిన పాటలు విని తన భర్త రాజీవ్ కనకాల ఓకే అంటే తన కూతురు మాత్రం చాలా అనుమానంగా తన వైపు చూస్తూ ఆ తరువాత మెచ్చుకుందని నవ్వుతూ చెప్పింది సుమ. 

సినిమా రంగంలో ఒక యాంకర్ కోసం మరో యాంకర్ పాట పాడటం ఒక రికార్డ్ అంటూ తనతో అనసూయ, శ్రీముఖి, రష్మీ ఇలా అందరూ తనను రెగ్యులర్‌గా టచ్‌ లో ఉంటూ తనను అక్కా అని పిలుస్తూ ఉంటారని యాంకర్ల అందరి పై ప్రేమను కురిపించింది సుమ.. 
 
Top