తెలుగు ఇండస్ట్రీలో 80వ దశకంలో తన అందాలతో మత్తు జల్లిన హీరోయిన్ అందాల అతిలోక సుందరి శ్రీదేవి. బాలనటిగా సీనీరంగ ప్రవేశం చేసిన శ్రీదేవి తర్వాత హీరోయిన్ గా అగ్ర కథా నాయకుల సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన సత్తా చాటింది..తర్వాత స్టార్ ప్రొడ్యూసర్ బోని కపూర్ ని వివాహం చేసుంది. పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీదేవి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది..ఈ మద్య మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
ఇక శ్రీదేవికి ఇద్దరు కూతుళ్లు జాహ్నవి, ఖుషి కపూర్..ఇప్పుడు ఇద్దరమ్మాయిలూ పెద్దయ్యారు. గత రెండు సంవత్సరాల క్రితమే జాహ్నవి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వచ్చినా అది జరగలేదు. కాకపోతే ఈ అమ్మడి పేరు మాత్రం సోషల్ మీడియాలో టాం టాం అవుతుంది. సినిమాల్లోకి రాకముందే రెచ్చిపోయి అందాలను ఆరబోయడమే కాకుండా పబ్లిగ్గా రొమాన్స్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్న విషయం తెల్సిందే. చిన్నకూతురు ఖుషీ కూడా తన బాయ్ ఫ్రెండ్ తో ముద్దులు ఇవ్వడం అవి కాస్తా ఫేస్ బుక్, ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో పెద్ద సంచలనమే అయ్యింది.తాజాగా శ్రీదేవి పెద్ద కూతురు మిడ్ నైట్ పార్టీలో రెచ్చిపోయి బాయ్ ఫ్రెండ్ తో డాన్స్ చేస్తూ మరింత సంచలనం సృష్టించింది . ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాహ్నవి డాన్స్ చేస్తుంటే , ఆమె నడుము దగ్గర చేతులు పెట్టి ఏదో ఏదో చేసాడు బాయ్ ఫ్రెండ్ శిఖర్ . వాళ్లిద్దరూ కలిసి రెచ్చిపోయిన తీరు ని వీడియో లో బందించి ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసాడు మనీష్ మల్హోత్రా.
ఈ మద్య బాలీవుడ్ సెలబ్రెటీ పిల్లలు ఇలాంటి చిలిపి పనులు చేస్తూ సెల్పీ లు తీయించుకొని, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఇక శ్రీదేవి కూతురు జాహ్నవి తెరంగేట్రం అదిగో ఇదిగో అంటూ చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి కానీ అదేదీ జరగలేదు . అయితే త్వరలోనే బాలీవుడ్ దర్శక దిగ్గజం కరణ్ జోహార్ ఈ భామని వెండితెర కు పరిచయం చేయనున్నట్లు సమాచారం.