ఈ మధ్య సినిమా హీరోలు అందరూ ఓన్లీ నటనకే పరిమితం కాకుండా సినిమా నిర్మాణంలో కూడా ప్రవేశిస్తున్నారు. తమ ఓన్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించి...  సినిమాలను నిర్మించి సక్సెస్ కూడా సాధిస్తున్నారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సినిమాలు నిర్మిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది హీరోలు తమ సొంత  ప్రొడక్షన్ హౌస్ లు  స్థాపించి  సినిమాలు నిర్మించి కొంతమంది హిట్లు  సాధిస్తే కొంతమంది ప్లాపులు వెనకేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ మెగా పవర్ స్టార్,  చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కొణిదెల అనే బానర్ తో ప్రొడక్షన్ హౌస్ స్థాపిస్తున్నాడు. 

అయితే చిరంజీవి తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు వచ్చారు ఇప్పటికి వస్తున్నారు  కూడా. చిరంజీవి,  పవన్ కళ్యాణ్, నాగబాబు ఇలాంటి వారు తమ ఓన్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించి  అంతగా సక్సెస్ సాధించలేకపోయారు. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు తో అంజనా ప్రొడక్షన్స్ అనే సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయించాడు. ఈ బ్యానర్లో చిరంజీవి కొన్ని  సినిమాలు చేసినప్పటికీ నాగబాబుకు మాత్రం ఒక్క హిట్టు కూడా ఇవ్వలేక పోయాడు. 

 అంజన ప్రొడక్షన్స్ లోనే  నాగబాబు పవన్ కళ్యాణ్ కూడా హీరోలుగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి కూడా హిట్ కొట్టలేకపోయింది. ఆ తర్వాత తనయుడు తోనైనా కలిసి వస్తుందనే ఉద్దేశంతో రామ్ చరణ్ తో ఆరెంజ్ సినిమా తీసి అది డిజాస్టర్ కావడంతో బాగా నష్టపోయాడు నాగబాబు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే బ్యానర్ తో ఓన్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఆ బ్యానర్ లో సర్దార్ గబ్బర్ సింగ్,   చల్ మోహన్ రంగా లాంటి సినిమా కూడా తీసి... హిట్ కొట్టలేకపోయాడు . దీంతో మెగా ఫ్యామిలీకి ప్రొడక్షన్ హౌస్ అంతగా కలిసి రాదని భావన సినిమా ఇండస్ట్రీలో ఏర్పడింది. 

 అయితే చిరంజీవి  రీ ఎంట్రీ కోసం రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఖైదీనెంబర్150 సినిమాను నిర్మించాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి  రాంచరణ్ కి ఎన్నో లాభాలు తెచ్చిపెట్టింది. అయితే ఇదే ప్రొడక్షన్ లో ప్రస్తుతం సైరా సినిమాను నిర్మిస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ తో భారీ అంచనాలతో అక్టోబర్ 2 న రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ ప్రొడక్షన్ హౌస్లలో  హిట్ సినిమాలు లేవనే రికార్డును   మొదటి సినిమా తోనే  తిరగరాశాడు రామ్ చరణ్.
 
Top