టాలీవుడ్‌ సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ  చిన్న ఖాళీ దొరికిన ఏ షాపింగ్ మాలో ఓపెన్ చేసుకుంటూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. అయితే ప్రసుతం విజయ్ దేవరకొండ లుక్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సారి విజయ్ దేవరకొండ హెయిర్ స్టైల్ మార్చడంతో లుక్ చాల బాగుంది. దాంతో విజయ్ దేవరకొండ లుక్ అయితే మాత్రం బాగా వైరల్‌ అవుతుంది.  ఇక విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన గత సినిమా డియర్‌ కామ్రేడ్‌ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. కానీ  విజయ్‌ దేవరకొండ మాత్రం తన తదుపరి సినిమాల షూటింగ్‌ లతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం  క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో  'వరల్డ్ ఫేమస్ లవర్' కోసం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా నుండి  ఇటీవలే వచ్చిన కొత్త పోస్టర్  సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి ఒక లేటెస్ట్ అప్ డేట్.. ఈ సినిమాకి సంబంధించి రెండు కీలకమైన  షెడ్యూల్స్ ను  యూరప్ మరియు హైదరాబాద్ లలో షూట్ చేయడానికి డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడు. వచ్చే నెల రెండో వారం నుండి ఈ షెడ్యూల్స్ మొదలవుతాయని తెలుస్తోంది.  కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియల్స్ బ్యాన‌ర్‌ పై కె.ఎ.వ‌ల్ల‌భ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.   కాగా ఈ రొమాంటిక్ ట్ర‌యాంగిల్ ల‌వ్‌ ఎంట‌ర్ టైన‌ర్‌లో  విజయ్ దేవరకొండ సరసన రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌,, క్యాథెరిన్ థెరిస్సా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

కాగా ఈ సినిమాతో విజయ్ పూరి జగన్నాథ్ తో కూడా ఓ సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.  అయితే ఇటివలే ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో  'ఫైటర్' అనే  టైటిల్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. కాగా తాజాగా ఈ టైటిల్ నే చిత్రబృందం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.  అలాగే ఈ సినిమా షూటింగ్ డిసెంబర్  నుండి మొదలుకానుందని తెలుస్తోంది.  మరి ఈ సినిమా ఏ జోనర్ లో తెరకెక్కనుంది.. సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు నటించనున్నారని నెటిజన్లు బాగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ గత చిత్రం డియర్ కామ్రేడ్ ఆశించిన విజయం సాధించలేక పోయింది. దాంతో విజయ్ దేవరకొండ ఆశలన్నీ   ఈ రెండు సినిమాల పైనే పెట్టుకున్నాడు.  
 
Top