టాలీవుడ్ జక్కన్న రాజమౌళికి క్యూట్ హీరోయిన్ సమంతల మధ్య విచిత్రమైన ట్విటర్ మాటల యుద్ధం అందర్నీ ఆశ్చర్య పరిచింది. గత కొన్ని రోజులుగా సమంత ఫ్యాన్స్ కొంతమంది ‘బాహుబలి’ లో సమంత, జూనియర్ ఎన్టీఆర్‌లకు గెస్ట్ రోల్స్ ఇవ్వవచ్చు కదా అంటూ రాజమౌళిని ఉద్దేశించి ట్వీట్స్ చేశారు. సమంతని తీసుకుంటే మీ సినిమాకి చాల ఎక్కువ పబ్లిసిటీ తో పాటు భారీ ఓపెనింగ్స్ కూడ వస్తాయి కదా అంటూ తెగ ఉచిత సలహాలు ఇచ్చారు వెబ్ మీడియాలో వస్తున్న ట్విట్స్ ను చూసి సమంత కూడ ఒక మాట కలిపి కొత్తగా తమకు పబ్లిసిటీ అవసరం లేదు కాని తమని కూడ ‘బాహుబలి’ లో తీసుకోమని రాజమౌళిని ఉద్దేసించి ట్విట్ పెట్టింది. అంతేకాదు తన అభిమానులను ఇక ఇటువంటి ట్విట్స్ పెట్టి రాజమౌళిని ఇరుకున పెట్టద్దు అంటూ వెబ్ మీడియాలో సూచనలను కూడ చేసింది. అయితే ఇదంతా గమనించిన మన జక్కన్న తిరిగి సమంతకు ట్విట్టర్‌లోనే రిప్లై ఇచ్చాడు. ‘అదేంటి సమంత అలా అంటావ్ నా సినిమాలో ఓ స్పెషల్ రోల్ చేయాల్సిందిగా నేను నిన్ను మొదట అడిగితే, అప్పుడు డేట్స్ అడ్జస్ట్ కావడం లేదని చెప్పావ్. ఇప్పుడేమో ఇలా నీ ఫ్యాన్స్‌ని నాపైకి ఉసిగొల్పుతున్నావ్’ అంటూ అభ్యంతరాన్ని వ్యక్తంచేశాడు. రాజమౌళి చేసిన ఈ ట్వీట్ కు సమంత రీట్వీట్ చేసింది 'ఓ మై గాడ్ సార్‌ర్‌ర్.. హ్హహ్హహ్హ' అంటూ నవ్వి తప్పించుకుంది. మరి ఇంత కధ నడిచింది కాబట్టి రాజమౌళి తన సినిమా ‘బాహుబలి’ లో సమంతకు ఏదైనా పాత్ర క్రిఎట్ చేస్తాడేమో చూడాలి.