కొతకాలం టాలీవుడ్ కు దూరమై కోలీవుడ్ లో అవకాశాలు వెతుక్కుంటున్న కాజల్ కు రామ్ చరణ్ సెంటిమెంట్ పుణ్యమా అని తిరిగి టాలీవుడ్ లో మెగా సినిమాలు చేయడానికి అవకాశం వచ్చింది. అనుకోకుండా జూనియర్ కు కూడా కాజల్ సెంటిమెంట్ గుర్తుకు రావడంతో పూరి దర్శకత్వంలో జూనియర్ నటించబోతున్న కొత్త సినిమాలో కూడ కాజల్ బుక్ కావడంతో తిరిగి టాలీవుడ్ లో కాజల్ హవా మొదలైంది అని అనుకున్నారు అంతా.  అయితే మధ్యలో గీతాంజలి సినిమాలో కాజల్ ఐటమ్ సాంగ్ చేసే విషయంలో ఈ మగధీర హీరోయిన్ కొన్ని రోజులు అటుఇటు ఆలోచించింది. దీనికి కారణం మిల్కీ బ్యూటీ తమన్నా ‘అల్లుడు శ్రీను’ సినిమాలో చేసిన ఐటమ్ సాంగ్ అని అంటున్నారు. ఈ సినిమాలోని తమన్నా స్పెషల్ సాంగ్ కు మిల్కీ బ్యూటీకి భారీ పారితోషికం ముట్టడంతో కాజల్ ద్రుష్టి తన గడపకు వచ్చి వాలిన ‘గీతాంజలి’ స్పెషల్ సాంగ్ పై పడింది అని టాక్.  అయితే కాజల్ ఈ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోకుండానే మీడియాలో తన పై వార్తలు నెగిటివ్ గా రావడంతో పాటు కాజల్ కు పరిచయం ఉన్న చాలామంది నిర్మాతలు ఫోన్స్ చేసి తమ సినిమాలలో కూడ ఐటమ్ సాంగ్ లు చేయమని అడగడంతో శాస్వితంగా ఐటమ్ గర్ల్ గా మిగిలిపోతాను అన్న బెదురుతో ‘గీతాంజలి’ సినిమా స్పెషల్ సాంగ్ ఆఫర్ ను వదులుకోవడమే కాకుండా మీడియా ద్వారా కూడ తెలియచేసి కాజల్ జాగ్రత్తలు తీసుకుంది అని టాక్. తమన్నా లా చెలరేగి పోదామని ప్రయత్నించినా ఒకేసారి కాజల్ ను చుట్టుముట్టిన ఫోన్స్ తో బెదిరిపోయిన ఈ గోల్డెన్ లెగ్ హీరోయిన్ తనకు ప్రస్తుతం తమన్నా తలనొప్పిగా మారింది అంటూ గగ్గోలు పెడుతోందని టాక్.

 
Top