నిన్న జరిగిన తెలంగాణ బంద్ దెబ్బతో వర్మ ‘ఐస్ క్రీమ్’ పూర్తిగా కరిగిపోవడమే కాకుండా ఐస్ క్రీమ్ పేరు వింటేనే జనం పారిపోతున్నారు. అయినా పట్టువదలని విక్రమార్కుడి లా వర్మ తన తరువాత సినిమాను తన ట్విటర్ లో ప్రకటించడమే కాకుండా ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ డిజైన్ కూడా ట్విట్టర్లో పెట్టేశాడు. ఆ సినిమా పేరు ‘XES’ అని అంటున్నాడు. రివర్స్‌లో తిరగేసి చదివితే ‘SEX’ అని వస్తుంది అని వర్మ అర్ధం కాబోలు. అయితే వర్మ మరొక ఆసక్తికర విషయాన్ని చెపుతున్నాడు. ఇప్పటి వరకు రకరకాల సినిమాలను తీసిన వర్మ పూర్తి శృంగార సినిమా తీయలేదట. అందువలెనే ఈ మూవీలో అదే కాన్సెప్ట్‌ అని అంటున్నాడు. ఈ సినిమా సినిమా SEX ఓరియెంటెడ్‌గా కాకుండా శృంగార రసాత్మకంగా ఉంటుందట. అయితే సెక్స్ కు శృంగారానికి తేడా తెలుసుకునే స్థాయిలో నేటి యువతరం ప్రేక్షకులు ఉన్నారా అన్నదే ప్రశ్న. ఈ వార్తలు ఇలా ఉండగా వర్మకు ఇదే సినిమాను XES  గా కాకుండా కోరిక పేరుతో తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడ వస్తున్నట్లు ఫిలింనగర్ టాక్. ఎన్ని పరాజయాలు ఎదురైనా చరిత్రలోని గజినీ మహమ్మద్ దండ యాత్రలులా వర్మ చేస్తున్న ప్రయోగాలు చూస్తుంటే వర్మకు ఏమైంది అని అనిపించక మానదు ఎవరికైనా.
 
Top