దక్షిణాది సినిమా రంగంలో శృతిహాసన్ హవా రోజురోజుకీ పెరిగిపోతోంది. ఆమధ్య ఓకే ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక హీరోయిన్స్ పై నిర్వహించిన సర్వేలో రెండవ స్థానాన్ని అందుకున్న శ్రుతి ఏకంగా ఆ సర్వే పోల్ ఫలితాలలో ప్రస్తుతం దక్షిణాది సినిమాలను షేక్ చేస్తున్న సమంతకు చోటు లేకుండా చేసి సమంతకు షాక్ ఇచ్చింది. ఇంతేకాదు అన్నట్లుగా ఇప్పుడు శ్రుతి తన పాపులారిటీతో ఏకంగా దక్షిణాది సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుల రికార్డులను బ్రేక్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. కమల్ కూతురుగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటూ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో తన ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది.  తాజాగా ఆమె ట్విటర్ పేజీ 12 లక్షలమంది ఫాలోవర్స్‌ని దాటేసింది. ఒకవిధంగా చెప్పుకోవాలంటే దక్షిణాదిలోవున్న స్టార్స్ హీరోల ట్విటర్ పేజీల ఫాలోయింగ్ లను అధిగమించి నెంబర్ వన్ పొజిషన్‌లో నిలిచింది. ప్రస్తుతం శ్రుతి ట్విటర్ కు 12 లక్షల ఫాలోయర్స్ ఉంటే రజనీకాంత్7,62,000, మహేష్‌‌బాబు 8,20,000, ధనుష్ 8,72,000, సమంత 6,49,000 లతో ఉన్న ఈ సెలెబ్రెటీల ట్విటర్ రికార్డులను బ్రేక్ చేసి శ్రుతి దూసుకు పోవడం అందర్నీ ఆశ్చర్య పరచడమే కాకుండా త్వరలోనే శ్రుతి నెంబర్ వన్ స్థానానికి చేరువవ్వడానికి అడుగులు వేస్తోంది అని అంటున్నారు.
 
Top