ఆరాధ్యకు తల్లి అయ్యాక కుడా ఐశ్వర్య క్రేజ్ తగ్గలేదుసరికదా మరింత
రోజురోజుకు క్రేజ్ పెరిగి పోతోంది. ఈ ప్రపంచ సుందరి తనను మెంటల్ టెన్షన్
పెడుతోందని తైవాన్‌లో నివసిస్తున్న నిరోషన్ అనే వ్యక్తి మీడియా ముందు
ప్రకటించడం సంచలనంగా మారింది.
తాను ఐష్‌ని ప్రేమించానని, తన మానసిక సంఘర్షణ పోవాలంటే ఆమెని కలుసుకోవాలని
కోరుతున్నాడు. శ్రీలంకలోని ‘డైలీ మిర్రర్’ పత్రిక ఇతగాడి ఈ ‘
ప్రేమాయణాన్ని’ ఇటీవల హైలైట్ చేసింది. 2007లో ఐశ్వర్యారాయ్ అభిషేక్
బచ్చన్‌ని పెళ్లాడాక నిరోషన్ డీలా పడిపోయి తన మానసిక స్థిమితాన్ని
కోల్పోయాను అని అంటున్నాడు.
తనను మెంటల్ టెన్షన్ పెట్టి అభిషేక్ ను పెళ్ళాడటం ద్వారా తనను మోసoచినందుకు
ఐష్‌పై దావా వేస్తానని అంటున్నాడు. అయితే ఇందుకు 70 లక్షలు అవసరం అవుతాయి
కాబట్టి ఆ డబ్బు గురించి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెపుతున్నాడు.
అయితే ఐశ్వర్య మాత్రం ఈ విషయం తనకు ఏమీ సంబందం లేదు అని అంటోంది. ఒకవైపు
అభిషేక్ కు తన భార్య ఐశ్వర్య విడాకుల టెన్షన్ పీడిస్తూ ఉంటే అనుకోని
అతిధిలా ఈ తైవాన్ దేశ అతిధి గోల ఏమిటీ అని బుర్ర పీక్కుంటున్నాడట.