టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న హీరోయిన్స్ లో కలర్ స్వాతి ఒకరు.
కలర్ స్వాతిను ఉపయోగించుకోవాలి కాని, ఫిల్మ్ ఇండస్ట్రీకు సరిపడ గ్లామర్,
యాక్టింగ్ ను తను ఇస్తుంది. రీసెంట్ గా కలర్ స్వాతి మ్యారేజ్ అంటూ టాలీవుడ్
లో న్యూస్ హల్ చల్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి న్యూస్ పై కలర్
స్వాతి ఇప్పటి వరకూ ఎటువంటి కామెంట్ చేయలేదు. ఫిల్మ్ సెలబ్రిటీస్ లలో
ఎవరిపైనా అయినా పెళ్ళి వార్తలు రాగానే వారు రెస్పాండ్ అయి, అటువంటి వార్తలు
ఫేక్ అంటూ రియాక్ట్ అవుతారు. కాని కలర్ స్వాతి మాత్రం అందుకు భిన్నంగా
ఉంది.
తను త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నానంటూ ఇండైర్ట్ గా వస్తున్న వార్తలకు
క్లారిటి ఇస్తుంది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఈ న్యూస్ ను
ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. చెన్నైకు చెందిన డైమండ్
వ్యాపారితో కలర్ స్వాతి నడిపిన ప్రేమాయణంకి ఇక ఫుల్ స్టాప్ పడుతుంది. తనపై
వచ్చిన పెళ్ళి వార్తలు నిజమే అంటూ సన్నిహితులు ద్వారా మీడియాకు
తెలియజేస్తుందట. ప్రస్తుతం కలర్ స్వాతి, నిఖిల్ సరసన కార్తికేయ మూవీలో
నటిస్తుంది.
ఈ మూవీ తరువాత మరో రెండు ప్రాజెక్ట్స్ కి సైన్ చేసింది. కాని ప్రెజెంట్ ఆ
రెండు ప్రాజెక్ట్స్ ని కొంత కాలం ఆపాలని నిర్మాతలతో సంప్రదింపులు
జరిపినట్టు సమాచారాం. పెళ్ళి కారణంగా ఆ మూవీలు ప్రస్తుత సమయంలో చేయలేనని
కలర్ స్వాతి చెప్పుకొచ్చింది. మొత్తంగా తను పెళ్ళి చేసుకుంటుందనే వార్త
తెలియటంతో చిన్న హీరోల కాంబినేషన్స్ కి హీరోయిన్స్ కొరత ఏర్పడిందని
అంటున్నారు.
కలర్ స్వాతి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకు పరిచయం అయినప్పటి నుండి ఇప్పటి
వరకూ అంచెలంచెలుగా తన ఫిల్మ్ కెరీర్ ను స్ట్రాంగ్ గా మలుచుకుంటూ వచ్చింది.
అయితే తను చేసిన మూవీలు బాక్సాపీస్ వద్ద మంచి పేరును తెచ్చినప్పటికీ, పెద్ద
హీరోల సరసన మాత్రం చేయలేకపోయింది.