టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస మూవీలు చేసుకుంటూ ఫుల్ బిజిగా ఉన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఆరు మూవీలు ఉన్నాయి. అందులో ఒకటి రిలీజ్ కి సిద్ధంగా ఉంటే, మరో మూడు ప్రాజెక్ట్స్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అలాగే ఇంకో రెండు ప్రాజెక్ట్స్ ప్రి ప్రొడక్షన్స్ జరుపుకుంటున్నాయి. ఈ విధంగా రకుల్ ప్రీత్ సింగ్ ఫుల్ బిజిగా ఉంది. అయితే రకుల్ మాత్రం ఇప్పటి వరకూ ఫుల్ ఎక్స్ పోజింగ్ చేసిన మూవీలు అంతగా లేవు. కాని ఏ నిర్మాతలు, హీరోలు, దర్శకులు అడగకుండానే తను ఫిల్మ్ ఇండస్ట్రీకి ఓ హాట్ ఆఫర్ ఇచ్చింది. దీనికి సంబంధించిన న్యూస్ ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. 'కథ లో సీన్ డిమాండ్ మేరకు నేను బికిని కూడ ధరిస్తాను. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. బికిని కోసం రెమ్యునరేషన్ ప్రత్యేకంగా ఏమి డిమాండ్ చేయను. కథ కోసం అవసరం అయితే తప్పదు కదా మరి' అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఢిల్లీ బేబ్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ విధంగా మాట్లాడటంతో ఇప్పటికే తను ఒప్పుకున్న మూవీలలో తన చేత ఏదోఒక విధంగా బికిని డ్రెస్ ని వేయించటానికి దర్శకులు తహతహ లాడుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ తన అప్ కమింగ్ ఫిల్మ్స్ లో ఒకటైన కరెంటు తీగ అనే మూవీ ఉంది. మంచు మనోజ్ నటిస్తున్న కరెంటు తీగ మూవీలో సన్నీలియోన్ కూడ నటిస్తుంది. ఇదే మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ సైతం నటిస్తుండటంతో, తన చేత ఓ సీన్ లో బికిని సూట్ వేయించాలని చిత్ర యూనిట్ ప్లానింగ్ చేస్తుంది. అందుకు రకుల్ ప్రీత్ సింగ్ కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లేటెస్ట్ గా తను బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం వెతుకుతున్నట్టు టాలీవుడ్ సమాచారం. ఎలాగూ బిటౌన్ లో ఎంట్రి ఇవ్వాలంటే ఎక్స్ పోజింగ్ అనేది కంపల్సరీ కాబట్టి, అదేదో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే చేస్తే తనకు మరింత డిమాండ్ ఉంటుందని రకుల్ భావించిందట. ఏదేమైనా రకుల్ ప్రీత్ సింగ్ చాలా డేర్ గా ఇటువంటి హాట్ ఆఫర్ ను ఇచ్చిందని టాలీవుడ్ అంటుంది.
 
Top