టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల తరువాత మరో హీరోయిన్ కి మోసం
జరిగిందనే న్యూస్ టాలీవుడ్ లో వినిపిస్తుంది. దీనికి సంబంధించిన
సమాచారాన్ని www.telugucinemasamacharam.in ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ఫిల్మ్
ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం మెగా హీరో అల్లుఅర్జున్ సరసన
నటించిన హీరోయిన్ కేథరిన్ థెరిస్సాను టాలీవుడ్ కి చెందిన ఓ హీరో మోసం
చేశాడంటూ కథనాలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే రేసుగుర్రం మూవీ
తరువాత కేథరిన్ థెరిస్సాకి నాలుగు మూవీల్లో వరుస ఆఫర్స్ వచ్చాయి. అలాగే తన
రెమ్యునరేషన్ సైతం దాదాపు 80 లక్షలకు చేరుకుంది.
ఈ ఆఫర్స్ వెనుక ఓ నిర్మాత ఉన్నట్టు టాలీవుడ్ లో టాక్స్. కాని సీన్ కట్
చేస్తే అప్పటికే కేథరిన్ థెరిస్సా టాలీవుడ్ కి చెందిన ఓ యంగ్ హీరోతో
డేటింగ్ చేస్తుందంటూ కథనాలు వినిపించాయి. ఆ హీరోకి ఉన్న పరిచయంతోనే కేథరిన్
థెరిస్సాకి అవకాశాలు వచ్చాయని కొద్ది నెలల క్రితం హాట్ టాపిక్ గా మారింది.
ఆ హీరోతో కేథరిన్ చాలా సన్నిహితంగా ఉండటంతో, కేథరిన్ థెరిస్సా ఇక అవకాశాల
గురించి ఏ మాత్రం ఆలోచించలేదు. కాని నెలలు గడుస్తున్నా ఆ మూవీలు స్టార్ట్
కాకపోవడంతో కేథరిన్ కి అనుమానం వచ్చిందట.
ఆ చిత్ర యూనిట్ ను సంప్రదించగా తనను ఆ మూవీల నుండి తొలగించి వేరే
హీరోయిన్స్ ను సెలక్ట్ చేసుకున్నట్టు తెలిసింది. అందులో రెండు మూవీలు
ఇప్పటికే షూటింగ్ ను ముగించుకొని, రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. కాని ఈ
న్యూస్ ని ఆ హీరో, కేథరిన్ కి తెలియకుండా మేనేజ్ చేశాడు. యంగ్ హీరోని
గుడ్డిగా నమ్మినందుకు, చాలా నష్టపోయానని కేథరిన్ థెరిస్సా తన సన్నిహితులతో
చెప్పుకొచ్చింది.