తాజాగా బాలీవుడ్ లో ఓ రికార్డ్ నమోదు అయింది. ఇదేదో బిటౌన్ హీరోలు క్రియోట్ చేసుకున్న రికార్డ్ కాదు. బిటౌన్ హీరోయిన్ క్రియోట్ చేసిన రికార్డ్. హీరోయిన్స్ మధ్య ఉన్న గ్లామర్ ఆధిపత్యానికి మధ్య జరిగిన రికార్డ్స్ ఇది. ఐశ్వర్యా రాయ్, విద్యాబాలన్, ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్, సోనమ్ కపూర్, ఈ ఐదుగురు హీరోయిన్స్ రికార్డ్ ని లేటెస్ట్ గా అనుష్క శర్మ బద్దలు కొట్టింది. ఐశ్వర్య రాయ్ ‘యాక్షన్ రీప్లే’ ఫిల్మ్ లో ఐశ్యర్య రాయ్ దాదాపు 125 కాస్ట్యూమ్స్ ధరించారు. తర్వాత ‘ఫ్యాషన్’ సినిమాలో ప్రియాంకా చోప్రా 100 దుస్తులు, ‘అయేషా’ సినిమాలో సోనమ్ కపూర్ 100 దుస్తులకు పైగా మార్చారు. ఇప్పుడు ఆ రికార్డ్స్ అన్నీ బద్దలు అయ్యాయి. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నమోదు అయిన ఆ తాజా రికార్డ్ ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ‘డర్టీ పిక్చర్’లో విద్యాబాలన్ సైతం 100 రకాల డ్రెస్ లతో అధరగొట్టింది. ఇప్పుడు వీళ్లందరికన్నా ఎక్కువ డ్రెస్ లు ధరించే అవకాశం అనుష్క శర్మ కొట్టేసింది. అనురాగ్ కాశ్యప్ దర్శకత్వంలో అస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ ‘బాంబే వెల్వెట్’ అనే దాంట్లో నటిస్తుంది. ఈ చిత్రంలో అనుష్క ‘జాజ్ సింగర్’ పాత్ర చేస్తున్నారు. అందుకని, రకరకాల దుస్తుల్లో మెరుస్తారట. ఆమె 140కి పైగా డ్రెస్ లో కనిపించిందని బిటౌన్ టాక్. ఈ డిజైనింగ్‌లో జాతీయ అవార్డు సాధించిన నిహారికా ఖాన్‌కి కాస్ట్యూమ్స్ డిజైనింగ్ బాధ్యతలు తీసుకుంది. అనుష్క శర్మని చాలా బ్యూటీపుల్ గా చూపింది. గతంలో ఏ హీరోయిన్ కూడ సెలక్ట్ చేసుకోని డ్రెస్సింగ్ స్టైల్ ని ఇందులో చూపారు. రెండు దశాబ్దాల నేపథ్యంలో జరిగే కథతో ఈ సినిమా ఉంటుందట. సినిమా మొత్తం అనుష్క శర్మ గ్లామరస్‌గా కనిపిస్తారు. అలాగే రణబీర్ కపూర్ ని సైతం ఈ మూవీలో వెరీ హ్యాండ్ సమ్ గా చూపించారు.
 
Top