ప్రపంచ వ్యాప్తంగా రికార్డులకు చిరునామాగా ఉండే గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక సినిమాలోని ఒకేఒక్క పాటలో అత్యధిక ముద్దు సన్నివేశాలను చిత్రీకరించి గిన్నిస్ రికార్డ్ సాధిస్తానంటున్నాడు దర్శకుడు జేఎం ఇసాక్. ఈయన తొలి చిత్రం ‘అగడం’ను ఎడిటింగ్ లేకుండా తెరకెక్కించి ఇప్పటికే గిన్నిస్ రికార్డు సాధించాడు. ఇసాక్ రూపొందిస్తున్న రెండో చిత్రం ‘లారా’, లాస్ట్ బెంచ్ బాయ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కనున్న సినిమాలో నూతన నటుడు హరి, శ్రీప్రియాంక, గీతాంజలి, లక్ష్మీ కిరణ్, గణేష్, చంద్రు, శిబి, సేతన్, విఘ్నేష్, గాట్పాడి షణ్ముగం తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్ర విషయాలను వివరిస్తూ వైవిద్యభరితమైన చిత్రాల దర్శకుడు తన సినిమాకు కొత్త కథను తయారు చేసుకోవడానికి ఏకాంత ప్రదేశానికి వెళితే అతడి పై సందేహంతో ఆయన భార్య కూడా వెళుతుందట. అక్కడ ఆ దర్శకుడి కథ రాయడానికి పలు అవాంతరాలు ఎదురవుతాయి చివరి వరకు ఆయన కథను రాయలేక పోతాడు.. ఆ ఆటంకాలకు కారణాలేమిటన్న విషయంపై ఒక దిగ్భ్రాంతి కలిగించే సంఘటన ఆధారంగా రూపొందించే హర్రర్ మూవీ అని అంటున్నాడు దర్శకుడు. ఈ సినిమాలోని ఒక పాటలో అత్యధిక ముద్దు సన్నివేశాలను చిత్రీకరించి గిన్నిస్ రికార్డు సాధించచనున్నట్లు దర్శకుడు ఇసాక్ ప్రకటించాడు. ప్రయత్నం బాగుంది కానీ ఇన్ని ముద్దు సీన్స్ కు సెన్సార్ బోర్డు కత్తెర వేయకుండా ఉండాలి కదా!
 
Top