సౌత్ ఇండియా ఫిల్మ్ యాక్టర్ తమన్న, బిటౌన్ లో తన పవర్ చూపించింది. బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీను ఎట్రాక్ట్ చేసే పనిని తమన్న మొదలు పెట్టింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఓ మ్యాగజైన్ లో తమన్న లుక్స్ చాలా సెక్సీగా కనిపించాయి. అయితే ఇది శాంపిల్ మాత్రమ అని తమన్న అంటుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. తమన్న ప్రస్తుతం బిటౌన్ లో హమ్ షకల్స్ అనే మూవీలో నటిస్తుంది. ఈ మూవీలోని తన కోస్టార్ అయిన బిపాసబసు నుండి తమన్న తెగ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయితే తాజాగా జరిగిన మేటర్ తో ఈ గొడవ మరింత పెద్దది అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా ఫెమినా మ్యాగజైన్ బిసాపబసుని కాదని, తమన్నని మ్యాగజైన్ కవర్ పేజీగా వేసింది. నేషనల్ మ్యాగజైన్ కి తమన్న మొదటిసారిగా ఫొటోషూట్ ని ఇచ్చింది. దీని తరువాత తమన్న నిర్వహించుకున్న మరో సీక్రెట్ విజువలైజ్డ్ ఫొటోషూట్ ని హమ్ షకల్స్ మూవీ రిలీజ్ తరువాత విడుదల చేయటానికి సిద్ధంగా ఉంది. ఆ ఫోటోషూట్ కంప్లీట్ గా వెరీ హాట్ గా ఉంటుందని ఫోటోషూట్ నిర్వాహకులు చెబుతున్నారు. రీసెంట్ గా ఇలియాన చేసుకున్న బికిని ఫోటోషూట్ కంటే తమన్న ఫోటోషూట్ చాలా బాగుందని కూడ బిటౌన్ ఫ్యాషన్ రిపోర్ట్. ఇదిలా ఉంటే తమన్న ఫోజ్ ఇచ్చిన ఈ ఫెమినా మ్యాగజైన్ లో తమన్న స్టైల్ ని చూసిన బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘నాట్ బాడ్’ అని అంటుంది. మొత్తానికి తమన్న మాత్రం బిటౌన్ లో సీరియస్ గా ఆఫర్స్ సెర్చింగ్ చేస్తుంది కాబట్టి, మరో రెండు, మూడు అవకాశాలు రావచ్చని అంటున్నారు. గతంలో తమన్న హిమ్మత్ వాల మూవీలో నటించేటప్పడు తను నేషనల్ మ్యాగజైన్ కి ఎటువంటి ఫోటోషూట్స్ ను ఇవ్వటానికి ఆసక్తి చూపలేదు. కాని ఇప్పుడు మాత్రం తమన్న ఫోటోషూట్స్ కోసం పిలిచి మరీ డేట్స్ ఇస్తుందట.
 
Top