దర్శకుడు గౌతమ్ మీనన్ పేరు చెపితే కోలీవుడ్ టాప్ హీరో సూర్యా లాంటి
వ్యక్తులు కూడ గౌరవిస్తారు. అటువంటి క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్
అనుష్క ఓవర్ యాక్షన్ తట్టుకోలేక ఆమెకు సీరియర్ వార్నింగ్ ఇచ్చినట్లుగా
వార్తలు వస్తున్నాయి.
ఎపి హెరాల్డ్ కు అందిన సమాచారం మేరకు అనుష్క ప్రస్తుతం కోలీవుడ్ హీరో అజిత్
తో చేస్తున్న సినిమాకు డేట్స్ ఇచ్చి కూడ షూటింగ్ కు రాకుండా రకరకాల
కారణాలు చెపుతూ షూటింగ్ స్పాట్ కు ఎగనామం పెట్టి కేరళా మసాజ్ చేయించుకుంటు
ఆమె అందాన్ని మెరుగు పరుచుకునే పనిలో బిజీగా ఉండటంతో గౌతమ్ మీనన్ దర్శకత్వం
వహిస్తున్న సినిమా షూటింగ్ ఆమె రాకపోవడంతో ఆపేశారు.
దీనితో హీరో అజిత్ డేట్స్ వృధా అవ్వడమే కాకుండా నిర్మాతకు భారీ నష్టం
కలిగింది. అసలే ముక్కోపి అయిన గౌతమ్ మీనన్ అనుష్క పై ఒంటికాలు పై లేవటమే
కాకుండా అనుష్క వ్యవహార తీరుపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేస్తానని
బెదిరించాడని కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది.
దీనితో రాజమౌళి నరకం తప్పి గౌతం మీనన్ టార్చర్ లో పడ్డానని మన జేజమ్మ
గగ్గోలు పెడుతోందట. కత్తులతో యుద్దాలు చేయలేక గ్లామర్ క్వీన్ గా
కనిపిద్దామని అనుకుంటే కోలీవుడ్ లో కూడ అనుష్కకు కష్టాలు తప్పడంలేదు.