సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోయిన్ జీరో సైజ్ తో అష్ట కష్టాలు పడుతుంది. తనది కాని పనిని చేసి తిప్పలు తెచ్చుకుంటుంది. బిటౌన్ లో ఉండే కల్ఛర్ ని, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిచయం చేసి, తెగ ఆఫర్స్ ని కొట్టేద్దామని ట్రై చేసి భంగపడింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ఇక తాజాగా ద‌క్షిణాది ముద్దుగుమ్మ ల‌క్ష్మీరాయ్ జీరో సైజ్ బాడీలోకి చేరింది. మొన్న‌టి వ‌ర‌కు త‌మిళ తంబీలు మెచ్చే బొద్దుగుమ్మ‌ల లిస్ట్ లో వున్న ఈ క‌న్న‌డ బ్యూటీ, ప్ర‌స్తుతం జీరో సైజ్ చేసి వావ్ ల‌క్ష్మీరాయ్ అనిపించేలా ఫిగ‌ర‌వుట్ చేసింది. దక్షిణాది హీరోయిన్స్ లో ల‌క్ష్మీరాయ్ కూడా కొంత వ‌ర‌కు గ్లామ‌ర్ హీరోయినే అనిపించుకుంది కానీ.. త‌న‌కు పెద్ద స‌క్సెస్ లు లేక పోవ‌డం తో స్పెష‌ల్ క్రేజ్ అంటూ ఏర్ప‌డ‌లేదు. అయిన‌ప్ప‌టీకి ఏదో విధంగా అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటూనే ఉంటుంది. ఆ మ‌ధ్య తెలుగులో ర‌వితేజ బ‌లుపు చిత్రంలో ఐట‌మ్ సాంగ్ తో అద‌ర గొట్టింది. బొద్దుగా వున్నాఅందంతో అందరిని అలరించింది. ఇక లెటేస్ట్ స‌మ‌చారాం ప్రకారం, ల‌క్ష్మీరాయ్ హ‌ర్ట్ వ‌ర్క్ చేసి జీరో సైజ్ స‌క్సెస్ ఫుల్ గా చేసిందిట‌. దీంతో త‌న‌కు అవ‌కాశాలు ఇవ్వ‌డంటూ త‌న‌కు తెలిసిన ద‌ర్శ‌క ,నిర్మాత‌ల‌కు సమాచారం పంపుతుంద‌ట‌. ల‌క్ష్మీరాయ్ జీరో సైజ్ ను చూసిన వాళ్లు ఫోటూషూట్ కి రమ్మని, అందాన్ని రికార్డ్ చేస్తున్నారు తప్పితే ఆఫ‌ర్స్ మాత్రం ఇవ్వ‌డం లేద‌ట‌. దీంతో ఈ జీరో బ్యూటీ కొంత నిరాశ ప‌డుతుంద‌ట‌. అంతే కాకుండా ప్రస్తుతం లక్మీరాయ్ తన జీరో సైజ్ ని మెయింటెన్ చేయలేకపోతుందని సమాచారం.
 
Top