టాలీవుడ్ బూతు సినిమాల దర్శకుడిగా అతి తక్కువ కాలంలో వెలుగులోకి వచ్చిన
మారుతి తన ఇమేజ్ ను మార్చుకుందామని ప్రయత్నిస్తున్న నేపధ్యంలో ఆ ఇమేజ్
పోలేదు సరికదా మారుతి పాపులారిటీ కూడ టాలీవుడ్ లో తగ్గిపోవడం అందర్నీ
ఆశ్చర్య పరుస్తోంది.
దీనికి ఉదాహరణగా మారుతి ప్రెజెంట్స్ అని వేసినా కూడా ‘గ్రీన్ సిగ్నల్’
సినిమాను కొనేవాళ్లు కరువయ్యారని తెలుస్తోంది. మూడు కోట్ల బడ్జెట్ తో తీసిన
ఈ సినిమా ఇప్పుడు నిర్మాతకు బిపీ పెంచడంతో ఏదోవిధంగా థియేటర్లు వెదుక్కుని
ఈరోజు విడుదల చేస్తున్నారు.
అయితే కొంతలో కొంత ఆనందం ఏమిటంటే, ఈ మధ్య కాలంలొ వచ్చిన మారుతి ప్రెజెంట్స్
సినిమాలన్నింటి కన్నా ఈ సినిమా కాస్త బెటర్ అనే టాక్ ఫిలింనగర్ లో
వినిపిస్తోంది. ఈ వారం పెద్ద సినిమాలు ఏమి లేకపోవడంతో ఈరోజు విడుదల
అవుతున్న ఈసినిమా భవిష్యత్ మరి కొద్ది గంటలలో తేలిపోతుంది.
మారుతి పేరు చెప్పుకుని మార్కెట్ చేసుకుందాము అని అనుకున్న నిర్మాతల
అంచనాలను ఈసినిమా నిలపెడుతుందా కనీసం ఈ సినిమాకు ఓపెనింగ్స్ అయినా వస్తాయా
అన్న టెన్షన్ లో నిర్మాతలు ఉన్నారు అని టాక్. ఎదిఎమైనా మారుతి పేరు
సినిమాలను రక్షించే రోజులు పోయాయి అని అనుకోవాలి.