సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ కాజల్ పని అయిపోయినట్టేనా అంటే దాదాపు అంతే అనే సమాధానం వస్తుంది. ప్రస్తతం కాజల్ నటిస్తున్న పెద్ద మూవీలు రెండు, మూడు అంత కంటే ఎక్కువ లేవు. ఆ తర్వాత కూడ కాజల్ కి భారీ ఆఫర్స్ వస్తాయనే నమ్మకాలు అంతకంటే లేవు. దీంతో ఈ విషయం తెలుసుకున్న కాజల్ తన రూటును మార్చుకుంటుంది. పెద్ద హీరోల తరవాత ప్లేస్ లో ఉంటున్న హీరోలకు తన కాల్షీట్స్ ని ఇస్తుంది. ఒకప్పుడు కోటి రూపాయల వరకూ తీసుకున్న కాజల్ ఇప్పుడు 80 లక్షలకి చేస్తుంది. చిన్న హీరోలతో నటించటానికి ఒప్పుకుంటున్న కాజల్ కి ఇప్పుడు అవకాశాలు ఎక్కువుగా వస్తున్నాయి. ఇప్పటికే ధనుష్ హీరోగా బాలాజీ మోహన్ దర్శకత్వం వహించే సినిమాలో చాన్స్ వచ్చింది. అలాగే కోలీవుడ్ కి చెందిన మరో మరో చిత్రానికి కూడా సంతకం చేసినట్టు సమాచారం. దీంతో పాటు యంగ్ హీరో జయం రవి సరసన నటించడానికి ఈ ముద్దుగుమ్మ ఓకే చెప్పింది. ఓ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ దీనిని నిర్మిస్తుంది. ఈ విధంగా కాజల్ ఫుల్ బిజీ గా మారబోతుంది. కాజల్ చిన్న హీరోలకు ఇస్తున్న ఈ ఆఫర్ తో, తన కాల్షీట్స్ మరో రెండు సంవత్సరాల పాటు ఫుల్ బిజీగా మారే అవకాశం ఉంది. చిన్న హీరోలతో కూడ కాజల్ నటించడం అయిపోతే, ఇక కాజల్ మూవీలకి గుడ్ బై చెప్పేసి, పళ్ళి చేసుకోవడం ఖాయం అని అంటున్నారు. కాజల్ ఇప్పటికే బిజినెస్ మెన్ తో ప్రేమాయాణాన్ని నడుపుతుంది. వీరి పెళ్ళి కూడ మరో రెండు సంవత్సరాల తరువాత ఉంటుందనే టాక్ వినిపిస్తంది. మొత్తంగా కాజల్ వ్యవహారం చూస్తుంటే అంతిమంగా పెళ్ళికి సిద్ధపడుతుదంనే అంటున్నారు.
 
Top