ఫిల్మ్ ఇండస్ట్రీలో ముఖ్యంగా హీరోయిన్స్ మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. ఒక
హీరోయిన్ కి ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయంటే మరో హీరోయన్ కి ఒళ్ళు మండుతుంది.
కుదిరితే ఆ ఆపర్ ను ఏదొకవిధంగా తనకు ధక్కించుకుందామా? అనే ఆలోచనలతో ఎంతకైనా
ముందుకు వెళుతుంటారు. ఆ సమయంలో హీరోయిన్స్ వీక్ నెస్ ను నిర్మాతలు, హీరోలు
ఉపయోగించుకుంటారు. ఇదిలా ఉంటే, సరిగ్గా ఇటువంటి వాతావరణమే ఇద్దరి
హీరోయిన్స్ మధ్య జరుగుతుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని
ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది.
ఆ ఇద్దరి హీరోయిన్స్ ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. సౌత్
ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగిన గోవా బ్యూటీ ఇలియాన, ఇప్పుడు
మకాం ను ముంబాయ్ కి మార్చింది. దాదాపు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి గుడ్ బై
చెప్పేసిందనుకోవాలి. ఎందుకంటే, సౌత్ నుండి కోటి రూపాయలు ఇస్తామన్నా, ఇలియాన
మాత్రం ఇటువైపు కన్నెత్తి కూడ చూడటం లేదు. అయితే తాజాగా ఇలియానకి మరో సౌత్
హీరోయిన్ పోటీ వస్తుంది.
తనే తమన్న. దీంతో తమన్న, ఇలియాన ఆఫర్స్ ని తీసేకుంటుందనే టాక్ బిటౌన్ లో
మొదలైంది. దాంతో తమన్నపై ఇలియాన మాటలు తూటాలు పెంచుతుంది. తమన్న, సౌత్
ఫిల్మ్ ఇండస్ట్రీలో బి గ్రేడ్ హీరోయిన్ అంటూ ప్రచారం చేస్తుందట. అంతే
కాకుండా తనది చాలా ఛీప్ మెంటాలిటి అంటూ అందరితో చెప్పుకొస్తుంది. ఇలియాన
చెబుతున్న మాటలు, తమన్నా వద్దకు వచ్చాయంట.
తనపై ఇలియాన టంగ్ స్లిప్ అయినందుకు, తనకి బిటౌన్ లో అవకాశాలు లేకుండా
చేస్తాను చూడు అంటూ అక్కడి మేనేజర్స్ తో తమన్న శపథం కూడ చేసిందంట.
ప్రస్తుతం సౌత్ నుండి బాలీవుడ్ కి వెళ్ళిన ఈ హీరోయిన్స్ ఒకరిపై ఒకరు
తిట్టుకోవడంతో, బిటౌన్ లో వీరిద్దరి టాపిక్స్ భలే ఆసక్తిగా మారింది.