బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్
ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాక్లెట్ బాయ్
రణ్ భీర్ కపూర్ హాట్ టాపిక్ గా మారాడు. గత కొన్ని సంవత్సరాలుగా
ప్రేమికులుగా ఉంటున్న కత్రినాకైఫ్, రణ్ భీర్ కపూర్ ల మధ్య ఓ పెద్ద గొడవ
జరుగుతుంది. దీనికి కారణం కత్రినాకైఫ్ స్నేహితులు అని బిటౌన్ మీడియా
చెబుతుంది. సరిగ్గా నాలుగు నెలల క్రితం రణ్ భీర్ కపూర్, కత్రినాకైఫ్
స్నేహితురాలితో ఎఫైర్ ని పెట్టుకున్నాడట.
అయితే ఈ మేటర్ ఇప్పుడు బిటౌన్ లో లీకయింది. కత్రినాకైఫ్ స్నేహితురాలు, రణ్
భీర్ కపూర్ తో పరిచయం పెంచుకుంది. చాలా సందర్బాల్లో కత్రినాకైఫ్, తన
ఫ్రెండ్ రియాసేన్ ని తీసుకొని రణ్ భీర్ కపూర్ తో పార్టీలకు వెళ్ళేది. ఈ
విధంగా రియాసేన్, రణ్ భీర్ కపూర్ తో పరిచాయాన్ని ఎక్కువుగా పెంచుకుంది.
అయితే వీరి వ్యవహారం డేటింగ్ వరకూ వెళ్ళడం జరిగింది. ఇది జరిగి దాదాపు
నాలుగు నెలలు గడిచినా కత్రినాకైఫ్ కి ఏ మాత్రం తెలియకుండా మేనేజ్ చేశారు.
అయితే రీసెంట్ గా రియాసేన్, ఈ విషయాన్ని తనే స్వయంగా కత్రినాకైఫ్ కి
చెప్పింది. దీంతో కత్రినాకైఫ్, రణ్ భీర్ కపూర్ పై పట్టరాని కోపంతో ఉంది.
తనను ఇంతలా మోసం చేసినందుకు తగిన శిక్ష విధిస్తా అంటూ నానా మాటలు అంటుందట.
అంతే కాకుండా తన పక్కనే ఉండి, రణ్ భీర్ కపూర్ ఇంత పని చేసినందుకు
స్నేహితురాలిని కత్రినా వదిలేసిందట. మొత్తంగా రణ్ భీర్ కపూర్ చేసిన పని
ఏమాత్రం బాగోలేదని బిటౌన్ సైతం అంటుంది.
అయితే బాలీవుడ్ కల్ఛర్ లో ఇలాంటివి చాలా కామన్ అంటున్నారు. పట్టించుకోనట్టు
ఉండాలని కత్రినాకైఫ్ కి సన్నిహితులు చెబుతున్నారు. వారు చెప్పింది నిజమే
కాని, ప్రస్తుతం వీరిద్దరూ నిజమైన లవర్స్ కావడంతో ఇక్కడే అసలైన చిక్కు
వచ్చింది. లవర్ కి తెలియకుండా ఇటువంటి వ్యవహారాలు నడపడంతో రణ్ భీర్ పై
కత్రినా సీరియస్ అయిందట.