ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ రేజీనా హవా విపరీతంగా నడుస్తోంది. యంగ్ హీరోలంతా తమ సినిమాలకు హీరోయిన్ గా రేజీనా పేరునే తమ దర్శక నిర్మాతలకు సూచిస్తున్నారు. ‘ఈగ’ లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించిన నాని కూడ ప్రస్తుత తన పరాజయాల పరంపర నుండి రెజీనా తనను రక్షిస్తుందేమోనన్న ఆశతో తనతో గతంలో ‘పిల్లజమిందారు’ లాంటి సినిమాను తీసిన అశోక్ దర్శకత్వంలో నటిస్తూ తనకు కూడ రెజీనానే కావాలని పట్టు పడుతున్నాడట. ఈ నేపధ్యంలో ఈమెతో రవికుమార్ దర్శకత్వంలో 'పిల్లా నువ్వులేని జీవితం' అనే సినిమాను చేస్తున్న మెగా కుటుంబ హీరో సాయి ధరమ్ తేజ్ ఒక ఆశక్తికర విషయాన్ని చెప్పాడు. ఈ సినిమాలో రెజీనా ఏకంగా సాయిధరమ్‌ను 14 సార్లు చెంపదెబ్బ కొట్టే సన్నివేశాలున్నాయట. అయితే ఈ విషయాన్ని స్వయంగా హీరోనే చెబుతున్నాడు. ''ఈ సినిమాలో హీరోయిన్ రెజీనా ఎప్పుడూ నా చెంప చెళ్లుమనిపిస్తూనే ఉంటుంది. చిత్రం మొత్తంలో పద్నాలుగు సార్లు కొడుతుంది. మరో విషయమేమిటంటే, నా తొలి చిత్రం 'రేయ్' లో కూడ హీరోయిన్ సయామీ ఖేర్ పదకొండు సార్లు చెంపపై కోట్టే సన్నివేశాలున్నాయి'' అని చెప్పుకొచ్చాడు సాయి ధరమ్. ఈ విధంగా తన ప్రతి సినిమాలోను తనతో నటించే హీరోయిన్స్ చేత చెంప దెబ్బలు కొట్టించు కోవడంతోనే తన జీవితం వెళ్లి పోతోంది అంటూ జోక్ చేసాడు మెగా హీరో చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.
 
Top