మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్ కి అవమానం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ
విషయాన్ని అందరూ తెలుసుకున్నారు. కాని ఐశ్వర్యారాయ్ మాత్రం తనకు ఏమి
పట్టనట్టు వ్యవహరిస్తుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్
ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న
67వ కేన్స్ చలన చిత్రోత్సవంలో ఐశ్వర్యరాయ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా
నిలిచింది. తల్లిగా మారిన తరువాత ఐశ్వర్యారాయ్ తన అందాన్ని మళ్ళీ ఫాంలోకి
తెచ్చుకుంటుందో లేదో అని అందరూ అనుకున్నారు.
కాని ఐశ్వర్యారాయ్ మాత్రం మునుపటి అందాన్ని తలదన్నేలా తిరిగి ఫాంలోకి
వచ్చింది. దీంతో ఇప్పుడంతా అందరి టాపిక్ ఐశ్వర్యారామ్ అందం గురించే. ఇదిలా
ఉంటే రీసెంట్ గా జరిగిన కేన్స్ ఫెస్టివల్ లో ఐశ్వర్యారాయ్ వేసుకున్న డ్రెస్
కాంట్రవర్సీకు దారి తీసింది. దీంతో ఆమె వేసుకున్న గౌనుపై వివాదం
చెలరేగుతోంది. ఐశ్వర్య వేసుకున్న గౌను అక్షరాల కాపీ కొట్టబడిందంట.
క్రిస్టిన్ ఛెనోవెత్ అనే బ్రాడ్ వే నటి ఇదే డిజైన్ తో కూడుకున్న డ్రెస్ ను
ఈ సంవత్సరం అకాడమీ అవార్డు ఫంక్షన్ లో ధరించింది.
ఆ డ్రెస్ ను రాబర్టో కావెల్లీ అనే డిజైనర్ ఛెనోవెత్ కోసం ప్రత్యేకంగా
డిజైన్ చేశాడట. ఆమె డ్రెస్ ను కాపీ కొట్టి, ఐష్ తన డ్రెస్ ను డిజైన్
చేయించుకుందని హాలీవుడ్ మార్కెట్లో సైతం విమర్శలు వినిపిస్తున్నాయి.
ఐశ్వర్యారాయ్ డ్రెస్ ను చూసిన కొందరు సూపర్భ్ అంటూ కళ్ళు అప్పగించి చూశారు.
కానీ ఒక్క రోజు తరువాత ఐష్ వేసుకున్న డ్రెస్ కాఫీ కొట్టిన డిజైన్ అని
తెలుసుకొని చాలా మంది ఐష్ పై కోపాన్ని పెంచుకున్నారు. ఏదేమైనప్పటికీ,
ఐశ్వర్యారాయ్ మాత్రం తిరిగి అందంతో ఫాంలోకి రావడంతో అభిమానులు అంతా తెగ
సంతోష పడుతున్నారు.