2005వ సంవత్సరంలో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన అనుష్క ఇప్పటి
వరకూ పలు మూవీల్లో నటించి అపారమైన అభిమానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం
అనుష్క మూడు పదుల వయస్సులో ఉంది. ఇదిలా ఉంటే అనుష్క ఫ్యామిలి మాత్రం అనుష్క
ను పెళ్ళి చేసుకోవాల్సిందిగా కోరుతున్నారంట. అయితే వరుడి విషయంలో మాత్రం
పట్టింపులు లేవంటూ అనుష్క కి ఫుల్ ఫ్రీడం ఇచ్చారు. గత నాలుగు సంవత్సరాలుగా
బెంగుళూరుకి చెందిన వ్యాపారవేత్తతో అనుష్క లవ్ లో ఉంది.
రెండు సంవత్సరాల క్రితం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారినా, అనుష్క మాత్రం
అలాంటిదేమి లేదంటూ చెప్పుకొచ్చింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు వీరిద్దరి
వ్యవహారం ఇంట్లోనూ తెలిసిపోయింది. సరిగ్గా రెండు నెలల క్రితం అనుష్క తన
ఫ్యామిలీ వ్యక్తులకు తన లవర్ ను పరిచయం చేసిందట. అనుష్క ఫ్యామిలీ మెంబర్స్,
అనుష్క లవర్ ని కలుసుకొని చాల విషయాలను తెలుసుకున్నారంట. దాదాపు అనుష్క
లవర్ తో, ఆ ఫ్యామిలీ ఒక రోజంటా టైంను స్పెండ్ చేసినట్టు వార్తలు
వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్
ప్రత్యేకంగా మీకు అందిస్తుంది.
ప్రస్తుతం అనుష్క చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ మూవీలు పూరైయ్యేవరకూ
ఏ మూవీలను ఒప్పుకోవడం లేదు. ఒకటి టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ అయిన
బాహుబలి మూవీ అయితే, మరో రెండు మూవీలు కోలీవుడ్ కి చెందిన రెండు క్రేజీ
ప్రాజెక్ట్స్. ఇందులో ఒకటి రజనీకాంత్ సరసన లింగా మూవీ అయితే, మరొకటి అజిత్
మూవీలో. ఈ విధంగా ఈ మూడు మూవీలను పూర్తి చేసుకున్న తరువాత అనుష్క పెళ్ళి
చేసుకోవటం గ్యారెంటీ అనే వార్తలు వినిపిస్తుంది.
మొత్తంగా అనుష్క సైతం పెళ్ళి చేసుకోవాటినికి సిద్ధంగా ఉంది. తను పెళ్ళి
చేసుకోబోయేనాటికి తన ఫిల్మ్ కెరీర్ పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఇక
మూవీలకు గుడ్ బై చెప్పేసి , సంసార జీవితాన్ని గడపాలని అనుష్క
కోరుకుంటుంది. అనుష్క ఫ్యామిలీ మెంబర్స్ కి అనుష్క లవర్ నచ్చటంతో, వీరి
ప్రేమాయణం పెద్దల సమక్షంలో వైభవంగా జరగనుందని అంటున్నారు.