What Is Good
  • ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్
  • రజినీకాంత్ స్టైల్.
What Is Bad
  • -కథనం
  • గ్రాఫిక్స్
  • ఎడిటింగ్. 
Bottom Line:విక్రమ సింహ : తొలి ప్రయత్నం కాబట్టి ఒకే ...

Vikrama Simha - చిత్ర కథ

రాజమహేంద్ర(జాకి ష్రాఫ్) కలింగపురం సైన్యానికి అధిపతి రానా(రజినీకాంత్), రానా కొత్తపట్టణం లోని బానిసలను తీసుకొని సరికొత్త సైన్యాన్ని సృష్టించాలని అనుకుంటాడు దారిలో వచ్చిన ప్రతి చిన్న రాజ్యాన్ని గెలుచుకుంటూ వెళ్తాడు రానా అదే వేగంలో కొత్తపట్టణం ని కూడా గెలవాలి అన్నదే అతని ఆలోచన. అదే సమయంలో రానా తన గగ్రామానికి తిరిగి రావాలని అనుకుంటాడు. ఉగ్ర సింహ(నాజర్) రానా ప్రతిభకి ముగ్ధుడు అయ్యి తన సైన్యాన్ని నడిపించమని కోరుతాడు. ఈలోపు రాజ ద్రోహం చేసాడని రాజ మహేంద్ర రానా ని చంపేయాలని నిర్ణయించుకుంటాడు. కాని ఈలోపే ఉగ్ర సింహ దగ్గర అరెస్ట్ అవుతాడు. అసలు విక్రమ సింహ ఎవరు అతనికి రానా కి ఉన్న సంభంధం ఏంటి ?వందన దేవి ఎవరు? అనేది మిగిలిన కథ...

Vikrama Simha - నటీనటుల ప్రతిభ

యానిమేషన్ చిత్రం కాబట్టి ఈ చిత్రంలో నటనా ప్రదర్శన గురించి చెప్పుకోవలసింది ఉండదు. కాని యానిమేషన్ చిత్రాలకు ప్రాణం అయిన గాత్రాన్ని చాలా అందంగా అమర్చారు. ముఖ్యంగా రజినీకాంత్ పాత్రకు మనో గాత్రం అద్భుతమయిన ఫీల్ ని సృష్టించింది. దీపిక పదుకొనే , జాకి ష్రాఫ్ , ఆది, నాజర్ , శోభన మరియు నగేష్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దాసరి నారాయణ రావు అందించిన వాయిస్ ఓవర్ బాగుంది. పాత్రల హావభావాలు సరిగ్గా చూపించలేకపోయారు. రజినీకాంత్ పాత్ర తప్ప మిగిలిన ఏ పాత్ర కూడా సరిగ్గా రాసుకోలేదు అన్ని పాత్రలు కూడా పరిపఖ్వత లేనివిగానే కనిపిస్తాయి. అంతేకాకుండా ఏ పాత్రకి సరయిన కారణం ఉండదు. అన్ని పాత్రలని కాస్త నీట్ గా అభివృద్ధి చేసి ఉంటె చిత్ర ప్రభావం బాగుండేది.

Vikrama Simha - సాంకేతికవర్గం పనితీరు

ఇది భారతదేశం లో మొట్టమొదటి మోషన్ క్యాప్చర్ చిత్రం అందులోనూ రెండర్ ఫోటో రియల్స్టిక్ విధానం ఉపయోగించారు. కాని అవి అంతగా ఆకట్టుకోలేకపోయింది. రజినీకాంత్ తో సహా ఏ ఒక్క పాత్ర హావభావాలు కూడా సరిగ్గా లేవు అంతే కాకుండా యానిమేషన్ చేసే విధానం లో సరైన కెమెరా యాంగిల్ ఉపయోగించక పోవడంతో సన్నివేశాల ప్రభావం పూర్తిగా పోయింది. దీనివల్ల మనుషుల ముఖ కవళికలు చాలా ఘోరంగా ఉన్నాయి. మనుషులను సాగదీసినట్టు ఉంటుంది ఈ చిత్రంలో , ఈ చిత్రం కథ కూడా కొత్తగా ఉండదు కే ఎస్ రవి కుమార్ మరియు సౌందర్య అశ్విన్ మరింత జాగ్రత్త వహించాల్సింది. చిత్రం సాగే కొద్ది తరువాత ఎం జరగనుంది అని ఊహించడం సులభం. విక్రమసింహ కాస్త కొత్తగానే ఉన్నా కథ మాత్రం పురాతన వస్తువు.. కథనం విషయం లో బొత్తిగా ఆకట్టుకోలేదు చెప్పేది ముందే తెలిసిన కథ అయినప్పుడు కాస్త వేగవంతమయిన కథనాన్ని రాసుకోవలసింది, చిత్రం ఆసాంతం ఇలాంటి సన్నివేశం ఎక్కడో చూసానే అన్న ఫీలింగ్ వస్తుంటుంది ఈ ఫీలింగ్ రానివ్వకుండా చేసుంటే బాగుండేది. చిత్రం చాలా చిన్నది కాని చాలా పెద్దదిగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఎడిటర్ ఇంకాస్త దృష్టి సారించి కత్తిరించి ఉంటె బాగుండేది. సంగీతం అందించిన ఏ ఆర్ రెహమాన్ పాటలే కాకుండా నేపధ్య సంగీతం కూడా చాలా బాగా అందించారు. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయ.

Vikrama Simha - చిత్ర విశ్లేషణ

ఈ చిత్రం నిజానికి ఒక కొత్త ప్రయత్నానికి నాంది, ఆ ప్రయత్నాన్ని ప్రోత్సహించాలన్న ఒక్క కారణం తప్పితే ఈ చిత్రంలో చెప్పుకోడానికి ఎం లేదు , పీరియడ్ చిత్రం కావడం మరియు అద్భుతమయిన కాస్టింగ్ ఉండటం ఈ చిత్రానికి ప్రధాన బలాలు , కాని కథ మరియు గ్రాఫిక్స్ తెర మీద అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మొదటి అర్ధ భాగం అయితే చాలా నెమ్మదిగా సాగటమే కాకుండా చాలా చికాకు కలిగిస్తుంది, రెండవ అర్ధ భాగం వచ్చేసరికి కథనంలో వేగం పుంజుకుంటుంది. ఈ చిత్రం చూసే ప్రతి ఒక్కరు ఏదో లోటు ఫీల్ అవ్వడం ఖాయం ఎందుకంటే ఈ చిత్రం మనం మాములుగా చూసే యానిమేషన్ చిత్రం కాదు కాని ఇలాంటి మోషన్ క్యాప్చర్ చిత్రాలు తెర మీదకు రావడం శుభపరిణామం. హాలీవుడ్ లో మొదటిసారిగా 1985లో వచ్చింది కాని పూర్తిస్థాయిలో ఉపయోగించింది మాత్రం అవతార్ చిత్రంలోనే అంటే దాదాపుగా పాతిక సంవత్సరాలు పట్టింది కాబట్టి మన తెర మీద అటువంటి క్వాలిటీ చూడటానికి మరో పది సంవత్సరాలు అయిన వేచి చూడవలసిందే. ఈ చిత్రాన్ని చూడటానికి కల ఒకే ఒక్క కారణం రజినీకాంత్ మీరు రజినీకాంత్ వీరాభిమానులు అయితే వెంటనే చిత్రానికి వెళ్ళిపొండి లేకపోతే మీకు చూడటానికి ఏ చిత్రం లేదంటే ఈ చిత్రం గురించి ఆలోచించి వెళ్ళండి..

 
Top