What Is Bad
- రెండవ అర్ధ భాగం కాస్త నెమ్మదిస్తుంది
- అనవసరమయిన కామెడీ సన్నివేశాలను జొప్పించడం.
Bottom Line:మనం - మన చిత్రం ... మనసు చిత్రం ..
Manam - చిత్ర కథ
ఈ సినిమా కథ 1983 ఫిబ్రవరి 13న మొదలవుతుంది. ఈ సినిమాలో ఎన్ని కథలు ఉన్నా
అన్ని కథలకి లింక్ మాత్రం ఫిబ్రవరి 13, 14 తేదీల్లో 10:20 నిమిషాలు.. ఇక
కథలోకి వెళితే.. ప్రేమ అనే దానికి మాత్రం పరిమితులు లేవు ఈ జన్మలో తమ ప్రేమను
సంపూర్ణ చేసుకోలేని వారు మరు జన్మలో తమ ప్రేమను పొందుతారనేదే ఈ సినిమా
సారాంశం.. ఓపెన్ చేస్తే ఓ అరెంజ్డ్ మ్యారేజ్.. అదే మన రాధా మోహన్(నాగ చైతన్య) -
కృష్ణవేణి(సమంత)లది. కొద్ది రోజులు బాగా ఆనందంగా సాగిన వీరి కాపురానికి
సాక్ష్యంగా కొడుకు పుడతాడు. తన పేరు బిట్టు. కట్ చేస్తే ఇద్దరి మధ్య
మనస్పర్ధలు వచ్చి విడిపోవాలనుకున్న సమయంలో ఊహించని విధంగా చనిపోతారు.
అక్కడి నుంచి కట్ చేస్తే మరు జన్మలో రాధ - కృష్ణ నాగార్జున(నాగ చైతన్య) - ప్రియ(సమంత)లుగా పుడతారు. కానీ ఒకరికి ఒకరు సంబంధం లేని వీరిద్దరినీ కలపడానికి ఇండియన్ టాప్ బిజినెస్ మాన్ నాగేశ్వరావు(నాగార్జున) తెగ ట్రై చేస్తుంటాడు. ఈ ప్రాసెస్ లో చైతన్య(నాగేశ్వరరావు) కారణంగా నాగేశ్వరరావు అంజలి(శ్రియ శరన్) ప్రేమలో పడతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే నాగేశ్వర రావు ఏమో నాగార్జున - ప్రియని కలపడానికి ట్రై చేస్తుంటే, చైతన్య ఏమో నాగేశ్వరరావు - అంజలిని కలపడానికి ట్రై చేస్తుంటాడు. అసలు వీరందరికీ ఒకరితో ఒకరికి ఉన్న సంబంధం ఏమిటి? నేను పైన చెప్పిన టైంకి సినిమాకి ఉన్న సంబంధం ఏమిటి అనేది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే..

Manam - నటీనటుల ప్రతిభ
నటీనటుల్లో చెప్పాల్సిన పేర్లు చాంతాడంత ఉంది.. ఈ సినిమాకి వన్ అండ్ ఓన్లీ
కింగ్ లెజండ్రీ యాక్టర్ ఎఎన్ఆర్ కాబట్టి ఆయన నుంచే మొదలు పెడతా.. ఈ సినిమాకి
కింగ్ మేకర్ అండ్ మెయిన్ హైలైట్ ఎఎన్ఆర్ గారే అని చెప్పడంలో ఎలాంటి సందేహం
లేదు. 90 ఏళ్ళ వయసులో కూడా ఆయన నాగార్జున, నాగ చైతన్యలకు మించి పెర్ఫార్మన్స్
చేసారు. నాగ్, చైతన్యనే ఆయన ముందు చిన్నబోయారని చెప్పాలి. ఎఎన్ఆర్ పాత్ర
చిన్నదే అయినప్పటికీ తన డైలాగ్ డెలివరీ, అల్లరి పనులతో ప్రేక్షకుల మదిలో
నిలిచిపోయాడు. ఇక నాగార్జున చేసిన రెండు పాత్రల్లో ఎక్కువ కనపడేది బిజినెస్
మాన్ పాత్ర. అమాయకత్వం, చిన్నపిల్లవాడి మనస్తతత్వం కలగలిపిన బిజినెస్ మాన్
పాత్ర చాలాబాగా చేసాడు. అలాగే పల్లెటూరి వాడి పాత్రలో కూడా పెర్ఫార్మన్స్
బాగుంది. ఇక నాగ చైతన్య నటన పరంగా ఈ సినిమాలో చాలా మెరుగుపడ్డాడు. అలాగే అతని
డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ లో చాలా బెటర్ మెంట్ కనిపిస్తుంది. కాలేజ్
స్టూడెంట్ పాత్రలో చాలా బాగా చేసాడు. ఎఎన్ఆర్- నాగార్జున-నాగ చైతన్య
కాంబినేషన్ లో వచ్చే సీన్స్ అన్నీ సింపుల్ గా అద్భుతః అని చెప్పుకోవచ్చు.
ఎఎన్ఆర్ - నాగ చైతన్య మరియు నాగార్జున - నాగ చైతన్యల కెమిస్ట్రీ అదరహో అనే
రేంజ్ లో ఉంది.
ఇక టాలీవుడ్ డ్రీం గర్ల్ సమంత సినిమాలో చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఒక పాత్రలో తన అల్లరి నటనతో ప్రేక్షకులను మనసును దోచేసుకుంటే, మరో పాత్రలో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. సమంత-చైతన్య కెమిస్ట్రీ మళ్ళీ వర్కౌట్ అయ్యింది. శ్రియ కూడా రెండు డిఫరెంట్ పాత్రలు చేసింది. అలాగే చాలామంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఈ సినిమాతో శ్రియ మళ్ళీ ట్రాక్ ఎక్కి సెకండ్ ఇన్నింగ్స్ ని జోరుగా సాగించవచ్చు. ఇక మిగిలిన వాళ్ళలో ముందుగా సినిమాలో వచ్చిన అతిధుల గురించి అమితాబ్ బచ్చన్, లావణ్య త్రిపాటి, నీతూ చంద్ర ఈ ముగ్గురు కనిపించేది ఒక్కొక్క సీన్ లోనే అయినా ఆ సీన్ కి న్యాయం చేసి మాయమయ్యారు. ఇక కమెడియన్స్ గా కనిపించిన వారిలో ఎంఎస్ నారాయణ, పోసాని కృష్ణమురళీ కాస్త నవ్వించగలిగారు. మిగతా కమెడియన్స్ అయిన బ్రహ్మానందం, అలీ, సప్తగిరి పెద్దగా నవ్వించలేకపోయారు.
లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చావ్.. అన్నట్టుగా క్లైమాక్స్ లో వచ్చినా అఖిల్ ఎంట్రీ సినిమా చూస్తున్న ఆడియన్స్ లో ఒక్కసారిగా10000వోల్ట్స్ హై వోల్టేజ్ పవర్ ని పాస్ చేస్తుంది. అఖిల్ లుక్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ బాగున్నాయి. అఖిల్ ఎంట్రీతో అప్పటి వరకూ 'మనం' పై ఉన్న ఫీలింగ్ రెట్టింపు అవుతుంది.

Manam - సాంకేతికవర్గం పనితీరు
దర్శకుడు విక్రం కుమార్ ఈ చిత్రాన్ని నడిపించిన తీరు అద్భుతం అని
చెప్పాలి , కథ అనుకోవడమే విభిన్నంగా అనుకున్నారు మూడు వివిధ కథలను ఒకటిగా
చేసిన తీరు అద్భుతం అందుకోసం అయన రాసుకున్న కథనం కూడా అంతే స్థాయిలో
ఆకట్టుకుంది. నిజానికి ఒక్కో గతాన్ని ప్రస్తుతానికి కలిపిన తీరు
ప్రశంసనీయమే కాదు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకునేలా చేసింది. ముఖ్యంగా
శ్రియ మరియు నాగార్జున సన్నివేశాలు చిత్రానికే హైలెట్. సినిమాటోగ్రఫీ
అందించిన వినోద్ పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి చిత్రం మూడు
వేరు వేరు సమయాల్లో జరుగుతుంది ఏ సమయానికి ఆ సమయం తగ్గట్టుగా అయన
అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ముఖ్యంగా నాగార్జున శ్రియ ఫ్లాష్
బ్యాక్ ఎపిసోడ్స్ వద్ద "వింటేజ్" లుక్ ని తెరకు అద్ధడంలో ఈయన పనితనం
గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సంగీతం అందించిన అనూప్ రూబెన్స్ కి
ఇది కెరీర్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు అయన ఇచ్చిన పాటలే కాకుండా అది వాడిన
విధానం కూడా బాగుండటంతో ఈ చిత్రం హైలెట్స్ లో సంగీతం కూడా చేరింది. ఇక
నేపధ్య సంగీతం విషయానికి వస్తే ప్రాణం పోశారు సన్నివేశాలకు అని
చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ అందించిన ప్రవీణ్ పూడి కొన్ని అనవసరమయిన కామెడీ
సన్నివేశాలను కత్తిరించి ఉండాల్సింది కాని కథను-కథను కలపడంలో ఈయన పాత్రే
కీలకం ఆ విషయంలో ఈయన నూటికి నూరు శాతం న్యాయం చేసారనే చెప్పుకోవాలి.
మాటలు చాలా సింపుల్ గా బాగున్నాయి. ఆర్ట్ గురించి చాలా ప్రత్యేకంగా
చెప్పుకోవాలి అన్ని సన్నివేశాలను అందంగా చూపించడంలో వీరి పాత్ర బలంగా
ఉంది. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి ఎక్కడా నిర్మాత వెనక్కి
తగ్గినట్టు అనిపించదు..
Manam - చిత్ర విశ్లేషణ
ఒక తండ్రికి ఒక కొడుకు ఇంతకన్నా ఏమి ఇవ్వగలడు "మనం" చిత్రాన్ని చూసాక
ప్రతి ప్రేక్షకుడు ఫీల్ అయ్యే మాట ఇది. అవును ఒక ప్రేక్షకుడు ఎలాంటి
చిత్రాన్ని కోరుకుంటాడో ఒక నిర్మాత ఎలాంటి చిత్రాన్ని నిర్మించాలని
అనుకుంటాడో ఒక కుటుంబం ఎలాంటి చిత్రం చూడాలని అనుకుంటుందో అలాంటిదే "మనం"
చిత్రం ..
ప్రాణం పెట్టి చేస్తే చిత్రం ఎలా ఉంటుందో ఈ చిత్రం అలా ఉంది. మొదటి సన్నివేశం నుండి నాగార్జున లో కనిపించింది ఇదే కథ నచ్చింది దీనికోసం ఏమయినా చెయ్యాలి అన్న తపన కనిపించింది. ఆయనే కాదు ప్రతి నటుడు/నటీమణి ప్రతి ఒక్కరిది అదే రకమయిన ఫీలింగ్ అనిపిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ చిత్రంలో నటించిన నటులందరు ఇష్టంగా ప్రాణం పెట్టి చేసారు. ఇక దర్శకుడు విషయానికి వస్తే ఒక్కో సన్నివేశాన్ని జాగ్రత్తగా ఏరి ఏరి జత పరిచి రచించినట్టు ఉన్నాయి సన్నివేశాలు. కొన్ని కామెడీ సన్నివేశాలు తప్పితే ప్రతి సన్నివేశం బాగుంది, ప్రేక్షకుడి మొహం మీద చిరునవ్వు ఎక్కడా చేరగా నివ్వలేదు అలా అని కామెడీ కాదది ఫీల్ గుడ్ సన్నివేశాలు. చివరి వరకు ఇలాంటి సన్నివేశాలే అలా అని తప్పులు లేవు అని కాదు కాని అవి పట్టించుకునే పరిస్థితిలో ఎవరు లేరు.. అసలు ఇలాంటి చిత్రం ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి అవును అది మూడు తరాలు కలిసి నటిస్తున్న చిత్రం మరింత జాగ్రత్తగా ఉండాలి కాని అయనకి ఉంది ఆ ధైర్యం ఆరోజు "శివ" నుండి ఈరోజు "మనం" వరకు అదే చెక్కు చెదరని ధైర్యం. ఈ చిత్రం చూసి బయటకి వచ్చాక కూడా మిమ్మల్ని ఈ చిత్రం తాలూకు జ్ఞాపకాలు వెంటపడుతాయి. ముఖ్యంగా అమ్మ అనే పదాన్ని సరికొత్త విధానంలో తెర మీద ఆవిష్కరించారు దర్శకుడు ఈ విషయంలో దర్శకుడిని ప్రశంసించి తీరాలి అంతే కాకుండా ఈ సన్నివేశాలలో సమంత నటన కూడా అద్భుతం అని చెప్పాలి. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ఆరో ప్రాణం.. ఇది అక్కినేని కుటుంబం చిత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం .. ప్రతి కుటుంబం చూడవలసిన చిత్రం ... ప్రతి తండ్రి చూడవలసిన చిత్రం ప్రతి కొడుకు చూడవలసిన చిత్రం .. ఇది మన చిత్రం .. మనసు చిత్రం ...