దివంగత దిగ్గజ నటి శ్రీదేవి, బాలనటిగా చిత్ర రంగ ప్రవేశం చేసి చిన్నతనంలోనే తన ఆకట్టుకునే నటనతో అందరితోనూ శభాష్ అనిపించుకున్నారు. ఇక ఆ తరువాత పెరిగి పెద్దయి హీరోయిన్ గా మారిన తరువాత, తెలుగుతో పాటు ఆమె పలు ఇతర భారతీయ భాషల్లో కూడా హీరోయిన్ గా నటించడం జరిగింది. ఇక ముఖ్యంగా ఆ సమయంలో ఆమెకు బాలీవుడ్ అవకాశాలు కూడా రావడం, వాటిని ఆమె సద్వినియోగం చేసుకోవడంతో అక్కడ కూడా ఆమెకు మంచి హిట్స్ దక్కాయి. ఆ విధంగా అప్పట్లో అన్ని భాషల్లోనూ, అందరూ స్టార్ హీరోలతోనూ నటించిన శ్రీదేవి, బ్యూటీ క్వీన్ గా తిరుగులేని లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరును గడించారు. 

అయితే అప్పటినుండి ఇప్పటివరకు బాలీవుడ్ లో అంతటి పేరుగాంచిన నటి లేదని అంటుంటారు ప్రేక్షకులు. ఇక ఇటీవల బాలీవుడ్ సినిమా రంగంలోకి ప్రవేశించిన యువ హీరోయిన్స్ లో చాలా మంది, ఆకట్టుకునే అందం మరియు మంచి నటనతో అక్కడ హిట్స్ సాదిస్తున్నప్పటికీ, శ్రీదేవి మాదిరి క్రేజ్ ని మాత్రం సంపాదించలేకపోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఉన్న బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో, రాబోయే రోజుల్లో ఎవరు బాలీవుడ్ బ్యూటీ క్వీన్ గా ఏలుతారు అంటూ ఒక మీడియా మాధ్యమం వారు నిర్వహించిన సర్వే లో అందరికంటే అత్యధికంగా ఓట్లు సంపాదించి ఆషీకీ 2 నటి శ్రద్ధ కపూర్ మొదటి స్థానంలో నిలవగా, ఆ తరువాత రెండవ స్థానంలో ఆమెకు దగ్గరగా కియారా అద్వానీ నిలిచిందట, 

ఇక మూడు, నాలుగు స్థానాల్లో జాన్వీ కపూర్, సారా అలీఖాన్ నిలిచారని, అలానే ఐదవ స్థానంలో దిశా పటాని నిలిచిందని అంటున్నారు.అయితే, దీన్ని బట్టి బాలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువగా శ్రద్ధ కపూర్ కు మాత్రమే ఓటేసినట్లు కాదని, ఎందుకంటే భవిష్యత్తులో ఆమె తనకు వచ్చే అవకాశాలు సద్వినియోగం చేసుకుని మంచి విజయాలు అందుకుని ముందుకు సాగితే తప్పకుండా ఆమె బాలీవుడ్ కు మరొక బ్యూటీ క్వీన్ అవడం ఖాయమని, అయితే అది ఏమాత్రం తప్పినా ఆమె స్థానాన్ని వేరొకరు ఆక్రమించే అవకాశం ఉందని అంటున్నారు అక్కడి సినీ విశ్లేషకులు. మరి అది ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే రాబోయే రోజుల్లో కాలమే దానికి సమాధానం చెప్పాలి....!! 
Next
This is the most recent post.
Previous
Older Post
 
Top