దక్షిణాది సినిమా రంగానికి సంబంధించి లేడీ సూపర్ స్టార్ ఎవరు అంటే ఎవరైనా మరొకమాట చెప్పకుండా నయనతార పేరు మాత్రమే చెపుతారు. 35 సంవత్సరాల వయస్సులోకి ఆమె వచ్చినా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గకపోగా సినిమాకు 3కోట్ల పారితోషికం తీసుకునే స్థాయికి నయనతార ఎదిగిపోయింది. ఆమె 60 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఆమె పై ప్రచురించిన ఒక ఆసక్తికర కథనం ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.

ఎప్పటి నుంచో నయనతార పెళ్లి గురించి వస్తున్న వార్తలకు మరొక ట్విస్ట్ ఇస్తూ ఆప్రముఖ మీడియా సంస్థ తన షాకింగ్ కథనంలో కొన్ని ఆసక్తికర విషయాలను పేర్కొంది. నయనతార వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు వ్రాస్తూ ఆమె జీవితంలో ఎదుర్కున్న ఆటుపోట్లు ఏహీరోయిన్ ఎదుర్కోలేదు అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ తన పెళ్లి విషయమై నయనతార తీసుకున్న సంచలన నిర్ణయానికి సంబంధించి లీకులు ఇస్తోంది ఆ మీడియా సంస్థ.

ప్రస్తుతం ఆమె యంగ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో డేటింగ్ చేస్తూ సినిమాలలో చాల బిజీగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే నయనతార క్రేజ్ ప్రస్తుతం పీక్ స్టేజ్ లో కొనసాగుతున్న నేపధ్యంలో ఆమె వంద సినిమాలు పూర్తి చేసుకున్న తరువాత మాత్రమే తన పెళ్ళి గురించి ఆలోచనలు చేయాలని అప్పటి వరకు తన పెళ్ళి విషయం వాయిదా వేయాలి అన్న ఆలోచనలు చేస్తున్నట్లు ఆ పత్రిక తన కథనంలో వివరించింది.

దీనితో నయనతార తన ఆలోచనల ప్రకారం 100 సినిమాలు పూర్తిచేయాలి అంటే మరో ఐదు సంవత్సరాల సమయం పడుతుంది కాబట్టి అప్పటి వరకు విగ్నేష్ శివన్ పరిస్థితి ఏమిటి అంటూ ఆమీడియా సంస్థ ప్రశ్నలు వేస్తోంది. ఇప్పటికే శింభూ ప్రభుదేవాలతో పీకలలోతు ప్రేమ వ్యవహారాలు నిర్వహించి ఆతరువాత వైరాగ్యంతో హిమాలయాలు వెళ్ళిపోయి ఆతరువాత భౌద్దమతం స్వీకరించిన నయనతార చిట్టచివరకు పెళ్ళి చేసుకుంటుందా లేదా అన్న విషయం పై సస్పెన్స్ మరికొన్ని  సంవత్సరాలు  కొనసాగే ఆస్కారం ఉంది..
 
Top