వివాహ అనంతరం సమంత నటిస్తున్న సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. నాగ చైతన్య నటించిన సినిమాలు మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. పెళ్లి తరువాత ఈ బ్యూటిఫుల్ కపుల్స్ కలిసి నటిస్తున్న సినిమా ‘మజిలీ’ . శివ నిర్వాణ దర్శకత్వంలో చైతూ .. సమంత జంటగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, లిరిక్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సంపాదించాయి. ఒక విభిన్నమైన ప్రేమకథాంశంతో ఈ సినిమా నిర్మితమవుతోంది. దివ్యాన్శక్ మరో కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు.
క్రికెట్ లో చైతూ రాణిస్తుండటం .. ఆయన దివ్యాన్శక్ ప్రేమలో పడటం .. భార్య అయిన సమంతను దూరం పెట్టడం ఈ టీజర్లో చూపించారు. ఒక్కసారి పోతే తిరిగిరాదురా .. అది వస్తువైనా .. మనిషైనా ..' అనే రావు రమేశ్ డైలాగ్ .. 'నువ్వు నా రూము లోపలికి రాగలవేమో గానీ, నా మనసులోకి ఎప్పటికీ రాలేవు' అనే చైతూ డైలాగ్ .. 'వెధవలకెప్పుడూ మంచి పెళ్లాలు దొరుకుతారని నువ్వే ప్రూవ్ చేశావ్' అనే పోసాని డైలాగ్ మనసుకు పట్టుకునేలా వున్నాయి.వ్ .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ పై కట్ చేసిన ఈ టీజర్ .. సినిమాపై ఆసక్తిని పెంచేదిలా వుంది. వరుస ఫ్లాపులు అందుకుంటున్న చైతూకి ఈ సినిమా కలిసి వస్తుందని ఆశలో ఉన్నారు ఫ్యాన్స్.