దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పనిలో రాజమౌళి ఎంత రాక్షసుడో ఇప్పటికే తెలిసిందే. ప్రతి సినిమాను ఓ యజ్ఞంలా భావిస్తారు రాజమౌళి. అయితే ఇటీవల రాజమౌళిలో ఓ మార్పు కనిపిస్తోంది.

గతంలో రాజమౌళి ట్విట్టర్లో చాలా యాక్టివ్ గా కనిపించే వారు. కొత్త సినిమాలపై స్పందించేవారు. సినిమా నచ్చితే దానిపై ట్వీట్ చేసేవారు. కేవలం రాజమౌళి ట్వీట్ ద్వారా ఫేమ్ తెచ్చుకుని హిట్టయిన సినిమాలు కూడా ఉన్నాయి.

అలాంటి రాజమౌళి ఇటీవల చాలా ప్రముఖ ఘటనలకు కూడా స్పందించడం లేదు. సాధారణంగా తన సినిమా విశేషాలను కూడా రాజమౌళి ట్విట్టర్ ద్వారా పంచుకునే వారు. కానీ ఇప్పుడు ఆయన సినిమా ఆర్ ఆర్ ఆర్ ప్రారంభమైనా దాని గురించి ట్విట్టర్ లో స్పందనే లేదు.

రాజమౌళి చివరిసారిగా డిసెంబర్‌లో ట్విట్టర్లో స్పందించారు. అంటే దాదాపు 60 రోజులుగా ఆయన ఒక్క ట్వీట్ కూడా చేయలేదన్నమాట. మరి ఆర్ ఆర్ ఆర్ సినిమా బిజీయో ఏమో కానీ రాజమౌళీ ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేయడమే లేదు. మళ్లీ ఆయన ట్విట్టర్ జోలికి ఎప్పుడొస్తారో ఏమో..?


 
Top