అత్యంత భారీ బడ్జెట్ తో ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయాలని నిర్మించ బడుతున్న ‘సైరా’ మూవీలోని పాత్రధారులకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ విడుదల చేస్తూ ఈమూవీకి క్రేజ్ పెంచుతున్నారు. అయితే అప్పుడే ఈమూవీ విడుదల కాకుండానే ఈమూవీ పై కూడ కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తూ కొన్ని సెటైర్లు వేస్తున్నారు.

ప్రధమ స్వాతంత్ర ఉద్యమం జరిగిన 18వ శతాబ్దం కాలంనాటి సినిమా కావడంతో ఈమూవీలో నటించే అన్ని పాత్రలకు నిండుగా గడ్డాలు మీసాలు పెట్టి ఈమూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్స్ విడుదల చేసారు. ఇప్పుడు ఈవిషయమే ఈమూవీ పై సెటైర్లు పడేలా చేస్తోంది. ఆకాలంలో మనుషులంతా మీసాలు గడ్డాలు బాగా పెంచేవారా ? భుజాల వరకు జుట్టు పెంచేవారా? వందేళ్ల కిందట భారతీయులకు గడ్డం గీసుకోవడం కూడా తెలీదా అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఈసినిమాకు సంబంధించి చాల కాలం క్రితం చిరంజీవి ఫస్ట్ లుక్ విడుదల చేసారు. పొడవాటి జులపాలతో దట్టమైన గడ్డంతో భలే ఉన్నాడే అన్న ఫీలింగ్ అందరికీ వచ్చింది. ఆ లుక్ కు మంచి స్పందన కూడ వచ్చింది. ఆతరువాత ఇదే సినిమాలో నటిస్తున్న సుదీప్ లుక్ విడుదల చేసారు. అయితే అతడి లుక్ కూడ ఇంచుమించు చిరంజీవి లుక్ లాగే అదే హెయిర్ స్టయిల్ అదే గడ్డం అదే మీసం చేతిలో ఆయుధం క్యారెక్టర్ పేరు మాత్రమే మారింది.
 
Top