ఎన్.టి.ఆర్, త్రివిక్రం కలిసి చేసిన అరవింద సమేత సినిమా రిలీజ్ టైం గంటలకు వచ్చేసింది. మరో 8 గంటల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. త్రివిక్రంతో కెరియర్ లో మొదటిసారి సినిమా చేసిన ఎన్.టి.ఆర్ సినిమాపై ముందునుండి నమ్మకంగా ఉన్నాడు. అరవింద సమేత కూడా దుమ్ముదులిపేయడం ఖాయం అనేస్తున్నారు ఫ్యాన్స్.

అయితే ఈ సినిమా టీజర్ ఓకే అనేలా ఉన్నా ట్రైలర్ మాత్రం నందమూరి ఫ్యాన్స్ లో జోష్ పెంచింది. ఎన్.టి.ఆర్ మార్క్ మాస్ ఫార్ములాతో పాటుగా త్రివిక్రం మార్క్ పెన్ పవర్ చూపించాడు. ఇక ఈ సినిమా యూఎస్ లో ప్రీమియర్స్ మొదలయ్యాయని తెలుస్తుంది. ఇక అక్కడ సినిమా చూసిన అభిమానులు ఈ సినిమాలో డైలాగ్స్ కేక అనేస్తున్నారు.

అరవింద సమేతలోని కొన్ని అదిరిపోయే డైలాగ్స్ మీకోసం :

నన్ను నమ్మిన వాళ్లకి నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తోడు ఉంటూనే ఉంటాను..
ఆన్సర్ కేని క్వశ్చన్ ఉండొచ్చేమో కాని నీ మీద ప్రేమ లేకుండా ఉండలేను..
విలన్ తో ఎన్.టి.ఆర్ చెప్పే డైలాగ్.. నీ పేరు విలువ నీకేం తెలుసురా.. మీ అమ్మానాన్న గుర్తుంటే తెలుస్తుంది..
మీరు ఏం చేస్తుంటారు.. మొన్నటిదాకా మొక్కలను కాపాడాను.. ఇప్పుడు ఇంకోటేదైనా ప్లాన్ చేయాలి..
ఆనందం ఎప్పుడైనా అరుదుగానే దొరుకుతుందండి.. అందుకే మనం ఎప్పుడూ దుఖిస్తూ సుఖిస్తూ జీవిస్తూ ఉండాలి..
గంటల్లో సంపాదించే వాడికి ఎప్పుడూ నెల జీతం తీసుకునేవాడు తోడుగా ఉన్నప్పుడే ఆ సంస్థ బలంగా ఉంటుంది..
సుఖం అన్నం రూపంలో వస్తే ఎవడూ తీసుకోడు, కాని అదే అన్నం బిర్యాని రూపంలో వస్తే ఎవడైనా తీసుకుంటాడు..
జీవితంలో ఎప్పుడైనా సాగిపోవాలి.. ఎక్కడా ఆగిపోకూడదు
ఆలీచించే వాడికంటే ఆలోచింపచేసే వాడే గొప్పోడు
మీ తాత కత్తి పట్టినాడు అంటే అది అవసరం.. అదే కత్తి మీ నాయన ఎత్తినాడు అంటే అది వారసత్వం.. అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం.. ఆ కత్తి నీ బిడ్డ నాటికి లోపమవుతుందా..
వినే టైము.. చెప్పే మనిషి వల్ల.. విషయం విలువే మారిపోతుంది..
 
Top