ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలతో సమానంగా టాప్ దర్శకులు కూడ తమ సొంత నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేసుకుంటూ తమకు క్రేజ్ ఉండగానే కోట్లాది రూపాయల భారీ ఆదాయం కోసం స్కెచ్ లు వేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం తన సినిమాలు అన్నీ తాను పరోక్ష భాగస్వామిగా కొనసాగుతున్న ‘హారికా హాసనీ’ బ్యానర్ పైన మాత్రమే తీస్తున్నారు.

పూరీ జగన్నాథ్ ‘వైష్ణో అకాడమీ’ అంటూ ఇప్పటికే తనసొంత ప్రొడక్షన్ హౌస్ పై చాల సినిమాలు తీసాడు. ఇప్పుడు ఇదే ట్రెండ్ ను కొనసాగిస్తూ దర్శకుడు కొరటాల శివ చేసిన లేటెస్ట్ ట్విట్ మెగా కాంపౌండ్ కు ఊహించని షాక్ ఇచ్చింది అన్నవార్తలు వస్తున్నాయి. కొరటాల శివ తన మిత్రుడు మిక్కిలినేని సుధాకర్ పుట్టినరోజు సందర్భంగా ఒక ట్విట్ చేస్తూ భవిష్యత్ లో తన సినిమాలు అన్నీ  ‘యువసుధ ఆర్ట్స్’ పేరుతోనే వస్తాయని ఆసినిమాలను తన మిత్రుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తాడు అంటూ ట్విట్ చేసాడు.

వాస్తవానికి ఈబ్యానర్ లో తాను నిర్మాణ భాగస్వామి అని చెప్పపోయినా తన భవిష్యత్ సినిమాలు అన్నీ ఈబ్యానర్ లోనే ఉంటాయి అని చెప్పడంతో కొరటాల ఈబ్యానర్ వెనుక నిర్మాతగా అజ్ఞాత పాత్ర పోషిస్తాడు అన్న విషయం స్పష్టమైంది. ఇప్పుడు ఈ ట్విట్ మెగా కాంపౌండ్ కు ఇరుకున పెట్టే న్యూస్ గా మారడంతో కొరటాలకు చెక్ పెట్టే వ్యూహాలు మెగా కాంపౌండ్ అనుసరిస్తోంది. 

వాస్తవానికి చిరంజీవి కొరటాల మూవీ ప్రాజెక్ట్ కు నిర్మాతలుగా కొణిదెల ప్రొడక్షన్స్ మాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి ఉంటారన్న ప్రకటన ఇప్పటికే వచ్చింది. కొరటాల తన ప్రొడక్షన్ హౌస్ కు సంబంధించిన ట్విట్ చేసిన తరువాత చిరంజీవి కొరటాల మూవీ ప్రాజెక్ట్ లో  వేరే భాగస్వాములు ఎవ్వరూ ఉండరనే లీకులు ఇస్తున్నారు. ఇప్పుడు ఈలీకులు సంచలనంగా మారడంతో చిరంజీవి కొరటాల మూవీ ప్రాజెక్ట్ వెనుక ఎదో జరుగుతోంది అన్న అనుమానాలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు కొరటాల శివ ఇప్పుడు ఏదో విధంగా ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు రావడానికి ఈ మార్గం ఎంచుకున్నాడ అన్న గాసిప్పులు హల్ చల్ చేస్తున్నాయి..  
 
Top