అత్యంత భారీ అంచనాలతో ఈరోజు విడుదలైన ‘అరవింద సమేత’ ఓవర్సీస్ టాక్ ప్రాధమిక లీకులు వస్తున్నాయి. మహిళా సాధికారిత ప్రధానాంశంగా త్రివిక్రమ్ స్టైల్ ను మార్చి రూపొంధించిన ఈమూవీ తొలి  30 నిమిషాలు కేక పుట్టించేలా ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ తో ఫస్టాప్ కొనసాగితే ప్రీ ఇంటర్వెల్ ముందు బ్లాస్టింగ్ మూమెంట్స్ ఈమూవీ హైక్ ను మరింత పెంచాయి అన్న వార్తలు వస్తున్నాయి.

అయితే ‘అరవింద సమేత’ త్రివిక్రమ్ మార్క్ ఎక్కడా కనిపించక పోవడంతో ఈసినిమాను చూస్తున్న ప్రేక్షకుడు తాము చూస్తున్న సినిమా త్రివిక్రమ్ సినిమా అన్న విషయాన్ని మర్చిపోయి మరో మాస్ డైరెక్టర్ సినిమా అన్న కోణంలో చూడాలి అని ఓవర్సీస్ ప్రేక్షకుల అభిప్రాయం. అలా చూస్తే జూనియర్ అభిమానులకు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులకు కూడ ఈసినిమా బాగా నచ్చుతుంది అని ఈమూవీ ఫస్ట్ ఆఫ్ ఇప్పటికే చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు లీకులు ఇస్తున్నారు. 

ఈమూవీ ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది. ఎన్టీఆర్ స్టామినాకు అద్దం పట్టింది అని అదేవిధంగా ఈమూవీ ఫస్టాప్‌లో పాటల్లో ఎన్టీఆర్ స్టెప్స్ బాగున్నాయి అని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈసారి త్రివిక్రమ్ గురి తప్పదు అంటూ ఈమూవీలోని ప్రతి క్యారెక్టర్ కు సరైన ప్రాధాన్యత కనిపిస్తోంది అంటూ ప్రాధమిక లీకులు వస్తున్నాయి. 

అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఈమూవీ తెల్లవారుజాము షో ముగియడంతో బయటకు వస్తున్న సామాన్య ప్రేక్షకులు చెపుతున్న అభిప్రాయం ప్రకారం ఈమూవీ కథలో చెప్పుకోతగ్గ కొత్తదనం లేదని కేవలం పగ ప్రతీకారం నేపధ్యంతో కూడిన మరో సినిమాగా మాత్రమే ‘అరవింద సమేత’ ను చూడాలని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ లీకులు అన్నీ ప్రాధమిక లీకులు మాత్రమే కాబట్టి ఈమూవీ గురించి స్పష్టమైన అవగాహన రావడానికి మరికొన్ని గంటలు పట్టే ఆస్కారం ఉంది.. 
 
Top