నాలుగు దశాబ్దాల క్రితం ఓ సాంగ్ అభిమానులే కాదు. అశేష ప్రేక్షకులందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఇద్దరు సూపర్ స్టార్స్ కలసి చిందులేసిన ఆ సాంగ్ ఓ లాండ్ మార్క్. వారికి సాయంగా వాన దేవుడు కూడా జతకలసి యమ యమగా తడిపేసి వెళ్ళాడు. రొమాంటిక్ సాంగ్స్ లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆ ఐటం నంబర్ ని టచ్ చేయడం అంటే అంత ఆషా మాషీ వ్యవహారం కాదు. మరి ఆ సాంగ్ ని పట్టుకోవాలంటే మళ్ళీ ఆ ఇంటివారే సాహసం చేయాలి. అదే జరిగిందిక్క
అందాల శ్రీదేవిగా రకుల్ ప్రీతీ సింగ్ అందాలను ముంచెత్తింది. అన్న గారి లా బాలయ్య వాటిని ఒడిసిపడుతూ వానలో తడిసి తరించాడు. ఈ ఇద్దరి జంట నాడు వేటగాడు అన్న గారు, అతిలోక సుందరి శ్రీదేవిలను తలపించి మురిపిస్తోంది. ప్రస్తుతం అన్న గారి బయోపిక్ లో ఈ సాంగ్ శరవేగంగా సాగుతోంది. ఇవాళ రకుల్ పుట్టిన రోజు దాంతో ఆ సాంగ్ లోని స్టిల్ ఒకదాన్ని అభిమానుల కోసం ఫిల్మ్ మేకర్స్ రిలీజ్ చేశారు.
అది చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు అచ్చం ఆ జంట మళ్ళీ ఇలాగ దిగిపోయిందా అని ఫుల్ ఖుషీ అవుతున్నారు. మెధావి దర్శకుడుగా పేరు పొందిన క్రిష్ ఈ మూవీని పది కాలాలు గుర్తుండిపోయేలా తీస్తున్నారు. అన్న గారి సినీ జీవిత చరిత్రతో పాటు ఆయన రాజకీయ జీవితాన్ని రెండు పార్ట్లుగా చేసి విడుదల చేస్తున్నారు.
జనవరి 9న ఎంటీయార్ కధానాయకుడు, జనవరి 26న ఎంటీయార్ మహా నాయకుడు పేరు మీద రిలీజ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ మూవీ షూటింగ్ దశలోనే క్రేజ్ తీసుకురావడమే కాకుండా ఫ్యాన్స్ తో పాటు సామాన్య జనం కూడా చూసేందుకు ఇంటెరెస్ట్ పెంచడంలో క్రిష్ ఫస్ట్ సక్సెస్ అయ్యారు.