తెలుగు ఇండస్ట్రీలో  ఈ మద్య కండలు తిరిగిన నటులు బాగానే వస్తున్నారు.  సిక్స్ ప్యాక్స్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.  బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి ఇంకా క్రేజ్ ఉందంటే అతని ఫిట్ నెస్ అనే చెప్పాలి.  ఇక తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి, బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో పోటా పోటా పోటీగా నటించిన నటులు ప్రభాస్, రానా అనే చెప్పాలి.  ప్రతినాయకుడిగా నటించిన రానా తెగబలిసిన అడవి దున్నతో పోరాడినపుడు రానా కండలు తిరిగిన బాడీతో ఎంత ఆకట్టుకున్నాడో చూశాం.రానా తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటుతున్నాడు.
హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ పోతున్న రానా ఆ మద్య తేజ దర్శకత్వంలో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి మంచి విజయం అందుకున్నాడు.  తాజాగా రానా కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.   నేనే రాజు నేనే మంత్రిలో బ్రిడ్జి మీద పడిపోతున్న కారును తన పిక్క బలంతో ఆపిన రానాయేనా... ఈ రానా ? అని పై ఫొటో చూసిన వారు అవాక్కవుతున్నారు.
 
Top